Pat Cummins: ఐపీఎల్ 2024 సీజన్ 17 రెండో రోజు జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. మ్యాచ్ ఓడినందుకు కాదు..గెలవాల్సిన మ్యాచ్ చివరి మూడు బంతుల్లో ఫలితాన్ని మార్చేసినందుకు. ఘోరంగా ఓడిపోవల్సిన మ్యాచ్ ఒక్కసారిగా సీన్ మారి విజయం ముంగిటకు వచ్చి అందర్నీ ఆశ్చర్చపర్చింది. అంతలో మళ్లీ దురదృష్టం వెంటాడి ఫలితం మారిపోయింది.
చివరి బంతికి 5 పరుగులు చేయలేక ఓటమిపాలవడంతో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఆ ఒక్కడి వల్లే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయామ్నాడు. ఆండ్రూ రస్సెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు దురదృష్టం కూడా తమను వెంటాడిందని కమిన్స్ తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసినా అదృష్టం కలిసి రాలేదన్నాడు. ఎందుకంటే కేకేఆర్ ప్రారంభ వికెట్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మొదట్లోనే పడగొట్టగలిగారు. ఓ దశలో కేకేఆర్ స్కోరు 119 పరుగులకు 6 వికెట్లు పడిపోయాయి. అప్పుడు బరిలో దిగిన ఆండ్రూ రస్సెల్ చెలరేగిపోయాడు. 25 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టుకు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించి ఎస్ఆర్‌హెచ్ అదృష్టంపై నీళ్లు చిమ్మాడు.
కేవలం రస్సెల్ వల్లనే తాము ఓడిపోవల్సి వచ్చిందని అందుకే ప్యాట్ కమిన్స్ చెప్పాడు. రస్సెల్ బ్యాటింగ్ బౌలింగ్ చేయడం కష్టమైపోయిందన్నాడు కమిన్స్. ఇక తమ జట్టులో క్లాసెన్ అసాధారణ ప్రదర్శన కనబర్చడం, షెహబాజ్ సహకరించడంతో జట్టు దాదాపుగా గెలిచిన పరిస్థితి వచ్చిందని, కానీ దురదృష్టం వెంటాడటంతో ఓడిపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు ప్యాట్ కమిన్స్. అత్యుత్తమ జట్టు అయిన కేకేఆర్‌కు సొంత మైదానంలో గట్టి పోటీ ఇవ్వగలిగామని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Pat Cummins: అతడే కారణం, మ్యాచ్ ఓటమికి కారణాలు వివరించిన కమిన్స్