SRH vs GT Match Abandoned: ఐపీఎల్ తాజా సీజన్లో మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్‌తో కీలకమైన మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరొక పాయింట్లు ఇవ్వడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సునాయాసంగా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. కోల్కత్తా మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దవగా.. హైదరాబాద్‌తో కూడా మ్యాచ్ రద్దవడంతో గుజరాత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. గెలిచి పరువు నిలుపుకోవాలనుకున్న మ్యాచ్‌లో గుజరాత్‌కు వరుణుడు మరోసారి దెబ్బ కొట్టాడు.
Also Read: IPL 2024 RR vs PBKS: సామ్ కరాన్ పోరాటంతో పంజాబ్‌కు విజయం.. రాజస్థాన్ రాయల్స్ నాలుగో ఓటమి
ఐపీఎల్ 17వ సీజన్లో లీగ్ దశ పూర్తవుతుండగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం విశేషం. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ జరుగాల్సి ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి సృష్టించింది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఏకధాటిగా వర్షం కురవడంతో టాస్ కూడా వేయలేకపోయారు. మధ్యలో కొంత వర్షం తగ్గగా టాస్కు ఏర్పాట్లు చేస్తుండగా మరోసారి వాన కురిసింది. ఎంతకీ వాన తగ్గకపోవడంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: IPL DC vs LSG: దుమ్మురేపిన పంత్ సేన.. విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పైకి.. లక్నో ఇంటికి
మ్యాచ్ రద్దుతో గుజరాత్ టైటాన్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెరొక పాయింట్ ఇచ్చారు. మ్యాచ్ రద్దవడం హైదరాబాద్‌కు కలిసొచ్చింది. 15 పాయింట్లు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్ సునాయాసంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. కోల్కత్తా, రాజస్థాన్ తర్వాత ప్లేఆఫ్స్‌కు చేరుకున్న మూడో జట్టు హైదరాబాద్. మూడు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో మరొక జట్టు అర్హత సాధించాల్సి ఉంది. నాలుగో జట్టు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్‌కు అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter