IPL Points Table 2024 Update: ఐపీఎల్ 2024 సీజన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. సిక్సర్లు, ఫోర్లతో బ్యాట్స్‌మెన్.. దిమ్మతిరిగే బంతులతో బౌలర్లు క్రికెట్ అభిమానులతను అలరిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు జట్లు ఐదేసి మ్యాచ్‌లు ఆడేయగా.. నాలుగు ఫ్రాంచైజీలు నాలుగేసి మ్యాచ్‌లు ఆడేశాయి. రాజస్థాన్ రాయల్స్ అజేయంగా నిలవగా.. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల ప్రదర్శన దారుణంగా ఉంది. అన్ని జట్లు మరో రెండు మూడు మ్యాచ్‌లు ఆడేస్తే.. సగం సీజన్ పూర్తవుతుంది. ఇప్పటివరకు రాజస్థాన్ టాప్ ప్లేస్‌లో నిలవగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాస్ట్ ప్లేస్‌లో ఉంది.
టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్.. 4 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 8 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రన్‌రేట్ కూడా +1.120 మెరుగ్గా ఉంది. కోల్‌కోతా నైట్ రైడర్స్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఒక ఓటమితో రెండోస్థానంలో ఉంది. +1.528 రన్‌రేట్ ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించగా.. ఆరు పాయింట్లు, +0.775 రన్‌రేట్‌తో మూడోస్థానంలో కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి.. ఆ తరువాత రెండింటిలోనూ ఓడిపోయింది. చివరి మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఓడించి మళ్లీ విజయాల బాట పట్టింది. ఆరు పాయింట్లు,
+0.666 రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా జోరు మీద ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఆరు పాయింట్లు, +0.344 రన్‌రేట్‌తో ఐదోస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో రెండింటిలో విజయం సాధించింది. నాలుగు పాయింట్లు, -0.196 రన్‌రేట్‌తో ఆరోస్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా సేమ్ అదే పరిస్థితి. -0.797 రన్‌రేట్ తక్కువగా ఉండడంతో పంజాబ్ కంటే వెనుక ప్లేస్‌లో ఉంది. వరుస హ్యాట్రిక్ ఓటములతో తొలి గెలుపు రుచి చూసిన ముంబై ఇండియన్స్.. రెండు పాయింట్లు, -0.704 రన్‌రేట్‌తో 8వ స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు చివరి రెండుస్థానాల కోసం పోటీ పడుతున్నాయి. రెండు జట్లు కూడా ఐదు మ్యాచ్‌ల్లో ఒకే విజయంతో 9, 10 స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ (-1.370) కంటే బెంగళూరు (-0.843) కాస్త బెటర్ రన్‌రేట్ ఉంది. అయితే ఒక్క గెలుపుతో పాయింట్ల టేబుల్‌లో జాతకం మొత్తం మారిపోతాయి.
Also Read: Balakrishna: టీడీపికీ ఊపు తెచ్చేందకు నందమూరి బాలకృష్ణ సైకిల్ రావాలి యాత్ర.. ఆ రోజు నుంచి మొదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
IPL 2024 Points Table: టాప్‌లో దూసుకుపోతున్న రాజస్థాన్.. సన్‌రైజర్స్ ఏ స్థానంలో ఉందంటే..?