Sameer Rizwi: ఐపీఎల్ 2024 వేలం ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ ధర పలికారు ఇద్దరు విదేశీ ఆటగాళ్లు. ప్రపంచకప్ హీరోలు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ కోసం బిడ్డింగ్ భారీగా జరగడంతో ధర ఆకాశానికి చేరిపోయింది. అదే సమయంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు కూడా ఊహించని ధర లభించింది.
ఐపీఎల్ 2024 వేలంలో కొన్ని పరిణామాలు అందర్నీ ఆకర్షించాయి. అలాంటివాటిలో కీలకమైంది అన్‌క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ వేలం. బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని పేరు. కేవలం 20 లక్షల బేస్ ప్రైస్‌తో వేలం ప్రారంభమైంది. వేలంలో సమీర్ రిజ్వీ పేరు రాగానే గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య గట్టి యుద్ధమే జరిగింది. ఢిల్లీ కేపిటల్స్ మధ్యలో డ్రాప్ కావడంతో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగింది. రెండు జట్లు ఎక్కడా తగ్గలేదు. చివరికి 20 లక్షల బేస్ ప్రైస్ ఉన్న ఆ ఆటగాడిని చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 8.40 కోట్లకు బిడ్ చేసి దక్కించుకుంది. ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్, ఎప్పుడూ ఐపీఎల్ ఆడని ఆటగాడికి ఇంత భారీ ధర పలకడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. అందుకే సమీర్ రిజ్వీ ఎవరని ఆరా తీయడం ప్రారంభించారు అంతా.
ఎవరీ సమీర్ రిజ్వీ
20 ఏళ్ల సమీర్ రిజ్వీ ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన బ్యాటర్ కమ్ ఆఫ్ స్పిన్నర్. యూపీ టీ20 లీగ్స్‌లో ఇతడి పేరు మార్మోగడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. యూపీ టీ20 లీగ్స్‌లో కాన్పూర్ సూపర్ స్టార్స్ తరపున ఆడి అత్యధిక పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో సమీర్ రిజ్వీ 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతేకాకుండా అద్భుతమైన ఆఫ్ స్పిన్నర్ కూడా. మొత్తం టోర్నీలో 9 ఇన్నింగ్స్‌లు ఆడి 455 పరుగులు సాధించాడు. అండర్ 23 స్టేట్ ఎ ట్రోఫీ ఛాంపియ్ షిప్‌లో యూపీకు కెప్టెన్‌గా ట్రోఫీని అందించాడు. అండర్ 16 విజయ్ మర్చంట్ ట్రోఫీ సమయంలో అయితే ఒకే రోజు 280 పరుగులు చేసిన రికార్డు ఉంది ఇతడికి.
యూపీ లీగ్‌లో ఇతడి ఆటను గమనించిన మూడు ఫ్రాంచైజీలు వేలం కంటే ముందు ఇతడి ఆట తీరును స్వయంగా పరిశీలించేందుకు ట్రయల్స్‌కు పిలిచాయి కూడా. అందుకే సమీర్ రిజ్వీకు ఇంత భారీ ధర లభించింది. ఇతడిని ఎంత ధరైనా చెల్లించి తీసుకోవాలని ధోనీ సూచించినట్టు తెలుస్తోంది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వేలంలో ఎక్కడా తగ్గలేదు.
Also read: Ind vs SA 2nd ODI: రెండో వన్డేలో టీమ్ ఇండియా ఘోర పరాజయం, సిరీస్ 1-1 సమం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook