IPL 2024: ఆర్సీబీని భయపెడుతున్న గ్రీన్ జెర్సీ... కారణం ఇదే..!

IPL 2024: ఆర్సీబీ తన తర్వాత మ్యాచులో కేకేఆర్ ను ఢీకొట్టబోతుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ఆర్సీబీ ఆరు మ్యాచుల్లో ఓడిపోయి అట్టడుగు స్థానంలో నిలిచింది. డుప్లెసిస్ సేన తన తర్వాత మ్యాచ్ లో గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగబోతుంది. ఈ జర్సీ ఆర్సీబీకి కలిసి వస్తుందా? రాదా?  

Written by - Samala Srinivas | Last Updated : Apr 20, 2024, 05:06 PM IST
IPL 2024: ఆర్సీబీని భయపెడుతున్న గ్రీన్ జెర్సీ... కారణం ఇదే..!

RCB to wear green jersey vs KKR: ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తర్వాత మ్యాచ్ లోనైనా గెలిచి గెలుపు బాట పట్టాలని ఆ జట్టు ఆలోచిస్తుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏప్రిల్ 21న కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య కీలకపోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు టీమ్ గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. అయితే ఇదే ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. డుప్లెసిస్ సేన ఫ్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే తర్వాత జరగబోయే అన్ని మ్యాచులు గెలవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆకుపచ్చ రంగు జెర్సీలో ఆర్సీబీ దిగడం ఆ జట్టుకు వరమా లేదా శాపమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

బెంగళూరు జట్టు 2011 నుంచి గ్రీన్ జెర్సీలో దర్శనమిస్తోంది. ఈ జెర్సీ ధరించి ఆర్సీబీ 13 మ్యాచులు ఆడగా నాలుగుసార్లు మాత్రమే నెగ్గి.. మరో 8 మ్యాచుల్లో ఓడిపోయింది. గత 5 మ్యాచ్‌లలో మూడు సార్లు పరాజయం పాలైంది.  అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. గత రెండు సీజన్లలో గ్రీన్ జెర్సీలో ఆడి బెంగళూరు విజయం సాధించింది. రేపు కేకేఆర్ పై గెలిచి ఆర్సీబీ గ్రీన్ జెర్సీ అన్‌లక్కీ వాదన ఈసారైనా పోగొట్టుకుంటుందేమో చూడాలి.

Also Read: IPL 2024: ఐపీఎల్ లో సిక్సర్లు మోత మోగిస్తున్న తెలుగోడు.. 21 ఏళ్లకే అరుదైన రికార్డు..

ఆర్సీబీ జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, రెహ్మద్ సిరాజ్, టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

Also Read: IPL 2024 Updates: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న ఆటగాళ్లు ఎవరో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News