Impact player rules: ఐపీఎల్ 2023లో కొత్తగా ప్లేయింగ్ 15, ఇంపాక్ట్ ప్లేయర్ ఎప్పుడు ఎలా ఉపయోగిస్తారు

Impact player rules: ఐపీఎల్ 2023కు సర్వం సిద్ధమౌతోంది. మరి కొద్దిగంటల్లో మినీ వేలం జరగనుంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2023 విషయంలో వస్తున్న కొత్త అప్‌డేట్ చర్చనీయాంశమౌతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 21, 2022, 06:34 PM IST
Impact player rules: ఐపీఎల్ 2023లో కొత్తగా ప్లేయింగ్ 15, ఇంపాక్ట్ ప్లేయర్ ఎప్పుడు ఎలా ఉపయోగిస్తారు

ఐపీఎల్ 2023లో తొలిసారిగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమలు చేయనున్నారు. అంటే ఇక నుంచి ప్లేయింగ్ 11 కాకుండా ప్లేయింగ్ 15 ఉంటుంది. అసలీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఏంటి, ప్లేయింగ్ 15 వల్ల ప్రయోజనమేంటనే వివరాలు తెలుసుకుందాం..

ఐపీఎల్ 2023 పూర్తిగా విభిన్నంగా ఉండబోతోంది. కీలకమైన ఆటగాళ్లు తిరిగి రావడంతో పాటు కొత్త నిబంధనలతో ఐపీఎల్ 2023 జరగనుంది. అదే సమయంలో కొత్తగా ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వస్తోంది అంటే కెప్టెన్ టాస్ సమయంలో ప్లేయింగ్ 11 కాకుండా ప్లేయింగ్ 15 జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. మ్యాచ్‌కు తలపడే రెండు జట్ల కెప్టెన్లు టాస్ సమయంలో ప్లేయింగ్ 11తో పాటుగా మిగిలిన నలుగురు ఆటగాళ్ల పేర్లు చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చు.

ఇంపాక్ట్ ప్లేయర్ ఎలా ఉపయోగిస్తారు

మ్యాచ్‌లో 14వ ఓవర్‌కు ముందు ప్లేయింగ్ 11 లోఏ ఆటగాడినైనా ఇంపాక్ట్ ప్లేయర్‌తో మార్చవచ్చు. కెప్టెన్, ప్రధాన కోచ్ లేదా మేనేజర్ ఈ మార్పు గురించి ఎంపైర్‌కు చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి ఇంపాక్ట్ ప్లేయర్ ఉపయోగించినప్పుడు అతడి కోటా మొత్తం ఓవర్లు బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయవచ్చు. రిటైర్డ్ హర్ట్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌ని చివరి ఓవర్‌లో మాత్రమే ఉపయోగించాలి.

ఎప్పుడు సాధ్యం కాదు

వర్షం కారణంగా ఓవర్లు తగ్గిపోయి..10 ఓవర్లకు కుదిస్తే ఇంపాక్ట్ ప్లేయర్ ఉపయోగం వర్తించదు. ఇంపాక్ట్ ప్లేయర్ ఓవర్ మధ్యలో గాయపడితే ఎంపైర్ ఆమోదంతో ప్రస్తుత సాధారణ ఫీల్డర్ ప్రత్యామ్నాయ నియమం వర్తిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ ప్రత్యామ్నాయంగా బౌలింగ్, కెప్టెన్సీ చేయలేడు.

Also read: Kapil Dev: క్రికెట్ ఒత్తిడి అనుకుంటే..అరటి పండ్లో, గుడ్లో అమ్ముకోండంటున్న కపిల్ దేవ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News