Prasidh Krishna Ruled Out From IPL 2023: ఐపీఎల్ ఆరంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడు. గాయం కారణంగా ఈ సీజన్‌కు అతని సేవలు కోల్పోతున్నట్లు రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం వెల్లడించింది. సెప్టెంబర్‌లో ప్రసిద్ద్ గాయపడగా.. వారం రోజుల క్రితం వెన్నుముకకు సర్జరీ పూర్తయింది. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను ప్రసిద్ధ్ కృష్ట సోషల్ మీడియాలో పంచుకున్నాడు. గెట్ వెల్ సూన్ అంటూ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రసిద్ద్ కృష్ట కోలుకోవడానికి మరో 6 నుంచి 8 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. గత సీజన్‌లో రాజస్థాన్‌ను ఫైనల్స్‌కు చేర్చడంలో ప్రసిద్ద్ కీలక పాత్ర పోషించాడు. 17 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. అంతముందు సీజన్‌కు వరకు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడాడు. ఐపీఎల్‌లో మొత్తం 51 మ్యాచులు ఆడి.. 49 వికెట్లు పడగొట్టాడు ప్రసిద్ద్. ఈ యంగ్ పేసర్ దూరమవ్వడం రాజస్థాన్‌కు తీరనిలోటుగా చెప్పవచ్చు. ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, ఓబెడ్ మెక్‌కాయ్ వంటి బౌలర్లతో పేస్ దళం పటిష్టంగానే కనిపిస్తోంది. వీరికి తోడు ఆల్‌రౌండర్ జేస్సన్ హోల్డర్ జట్టుతో చేరడం మరింత బలం చేకూరనుంది.
Be back soon, Skiddy. 💗
— Rajasthan Royals (@rajasthanroyals) February 17, 2023
కాగా.. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్‌ను శుక్రవారం వచ్చిన విషయం తెలిసిందే. మార్చి 31 నుంచి గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య పోరుతో ఈ సీజన్ ఆరంభంకానుంది. 12 స్టేడియాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడేళ్ల తర్వాత అన్ని జట్లు తమ సొంత మైదానంలో ఆడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం మొదటి మ్యాచ్ జరగనుంది. చివరి లీగ్ మ్యాచ్ మే 21న జరగనుండగా.. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ తేదీలను బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు. రెండు మ్యాచ్‌లు ఉన్న రోజులో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఒక మ్యాచ్, రాత్రి 7.30 గంటలకు ఒక మ్యాచ్ నిర్వహిస్తారు.
Also Read: Pawan Kalyan: చంద్రబాబుకు అండగా పవన్ కళ్యాణ్ సపోర్ట్.. వైసీపీ పాలనలోనే ఇలా చూస్తున్నాం..
Also Read: Geetha Singh: రోడ్డు ప్రమాదంలో హాస్యనటి గీతాసింగ్ కుమారుడు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి