IPL 2023: జడేజాను రిటైన్ చేసుకున్న సీఎస్‌కే.. ఎంఎస్ ధోనీకి వంగి నమస్కారం చేసిన జడ్డు! ట్వీట్ వైరల్

Eighth wonder to stay with us: CSK on Ravindra Jadeja. తనను రిటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంకు రవీంద్ర జడేజా వెరైటీగా ధన్యవాదాలు తెలిపాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 16, 2022, 01:02 PM IST
  • జడేజాను రిటైన్ చేసుకున్న సీఎస్‌కే
  • ధోనీకి వంగి నమస్కారం చేసిన జడ్డు
  • జడేజా ట్వీట్ వైరల్
IPL 2023: జడేజాను రిటైన్ చేసుకున్న సీఎస్‌కే.. ఎంఎస్ ధోనీకి వంగి నమస్కారం చేసిన జడ్డు! ట్వీట్ వైరల్

Ravindra Jadeja Cheeky reply to Chennai Super Kings for IPL 2023 retention: ఐపీఎల్ 2023 రిటెన్షన్ ప్రక్రియకు మంగళవారం (నవంబర్ 15) సాయంత్రం 5 గంటలకు గడువు ముగియడంతో.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తమ జాబితాను ప్రకటించింది. ఎవరూపో ఊహించని విధంగా స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోను చెన్నై రిలీజ్ చేసింది. రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్‌లపై సీఎస్‌కే వేటు వేసింది. ఇక యాజమాన్యంతో విభేదాల కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై జట్టులో ఉండటం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీఎస్‌కే జడ్డుని అట్టిపెట్టుకుంది.

ఐపీఎల్ 2022లో రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అప్పగించింది. అయితే వరుస పరాజయాల నేపథ్యంలో.. జడ్డుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జడేజానే స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దాంతో తిరిగి ఎంఎస్ ధోనీకే కెప్టెన్‌ బాధ్యతలను అప్పగించింది సీఎస్‌కే. అప్పటికే చాలా మ్యాచులు పూర్తవడంతో చెన్నై నాకౌట్‌ దశకు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. ఇక గాయం కారణంగా జడేజా గత సీజన్‌ను పూర్తిగా ఆడలేదు.

ఐపీఎల్ 2022 జరుగుతున్న సమయంలోనే రవీంద్ర జడేజాను చెన్నై జట్టులో కొనసాగించడంపై పలు అనుమానాలు రేకెత్తాయి. జడ్డూ కూడా తన సోషల్‌ మీడియా ఖాతాలో చెన్నై జట్టుతో ఉన్న ఫొటోలను తొలగించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ.. చెన్నై యాజమాన్యం ఐపీఎల్ 2023 కోసం రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో జడేజాను చేర్చింది. ఈ విషయంపై సీఎస్‌కే తన ట్విటర్‌లో ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేసింది. ‘నువ్ మాతో ఉండటం ఎనిమిదో వండర్‌’ అని జడేజా ఫొటోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

మరోవైపు తనను రిటైన్ చేసుకున్న చెన్నై యాజమాన్యంకు రవీంద్ర జడేజా వెరైటీగా ధన్యవాదాలు తెలిపాడు. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీకి మైదానంలో తను తల వంచి అభివాదం చేస్తున్న ఫొటోను జడేజా పోస్ట్ చేసి.. 'ప్రస్తుతం అంతా బాగానే ఉంది. రీస్టార్ట్' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ట్వీట్ చూసిన చెన్నై ఫ్యాన్స్ లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఐపీఎల్ 2023 మినీ వేలం డిసెంబరు 23న కోచిలో జరగనుంది.

Also Read: నవంబర్ 16న వృశ్చిక రాశిలోకి సూర్యుడు.. రాబోయే 30 రోజులు ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి!

Also Read: Aadhar Sim Card Check: మీ ఆధార్‌ నంబర్‌తో వేరేవాళ్లు సిమ్‌ తీసుకున్నారా.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News