SRH vs GT: గుజరాత్ జైత్రయాత్రకు బ్రేక్, ఎస్ఆర్‌హెచ్‌ రెండవ విజయం

SRH vs GT: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ పరంపర కొనసాగిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్‌కు బ్రేక్ వేసింది. 8 వికెట్ల తేడాతో విలియమ్సన్ టీమ్ ఘన విజయం సాధించింది  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2022, 06:26 AM IST
  • ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలకు బ్రేక్
  • గుజరాత్ టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఎస్ఆర్‌హెచ్
  • ఐపీఎల్ 2022లో ఎస్ఆర్‌హెచ్ రెండవ విజయం
SRH vs GT: గుజరాత్ జైత్రయాత్రకు బ్రేక్, ఎస్ఆర్‌హెచ్‌ రెండవ విజయం

SRH vs GT: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ పరంపర కొనసాగిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్‌కు బ్రేక్ వేసింది. 8 వికెట్ల తేడాతో విలియమ్సన్ టీమ్ ఘన విజయం సాధించింది

ఐపీఎల్ 2022 ప్రారంభంలో పేలవమైన ప్రదర్శనతో వరుసగా రెండు ఓటములు ఎదుర్కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక్కసారిగా కోలుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుతో జరిగిన మూడవ మ్యాచ్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ జట్టు..అదే ఊపు కొనసాగించింది. కీలకమైన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతేకాదు..వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి..162 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 50 పరుగులు, అభినవ్ మనోహర్ 35 పరుగులతో రాణించారు. శుభమన్ గిల్ ఈసారి 7 పరుగులకే వెనుదిరిగాడు. ఓ దశలో140 పరుగులే సాధిస్తుందనుకున్న గుజరాత్ టైటాన్స్‌కు చివరి ఓవర్లలో భారీగానే పరుగులు వచ్చాయి. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జాగ్రత్తగా ఆడింది. ఏ మాత్రం తత్తరపడకుండా లక్ష్యం వైపుగా సాగింది. ఓపెనర్లుగా బరిలో దిగిన అభిషేక్ శర్మ 42 పరుగులు చేయగా..జట్టు కెప్టెన్ విలియమ్సన్ 57 పరుగులు చేశారు. రాహుల్ త్రిపాఠీ 17 పరుగులు చేసి..దూకుడుగా ఆడుతున్న సమయంలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తెవాతియా బౌలింగ్‌లో తొలి బాల్‌నే సిక్సర్‌గా మల్చి..అదుపు తప్పి కిందకు పడిపోయాడు. కాలు తీవ్రంగా బెణికినట్టు తెలుస్తోంది. ఇక అతడి స్థానంలో వచ్చి నికోలస్ పూరన్ 34 పరుగులతో రెచ్చిపోయాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. చివర్లో 6 బంతుల్లో 1 పరుగు కావల్సి ఉండగా..పూరన్ సిక్స్ కొట్టడంతో ఎస్ఆర్‌హెచ్ రెండవ విజయాన్ని అందుకుంది. 

Also read: Dipika Pallikal: రెండు టైటిల్స్‌ గెలిచాం.. ఇప్పటికైనా టాప్స్‌లో చేర్చాలని కోరుకుంటున్నాం: దీపిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News