IPL 2022 Sixes: ఐపీఎల్-2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఎలాంటి అంచనాలు లేని జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరాయి. ఛాంపియన్ అయిన జట్లు ఇంటి బాట పట్టాయి. రేపటి నుంచి నాకౌట్ దశ మొదలు కానుంది. ఈక్రమంలో 15వ సీజన్‌లో ఎన్నో రికార్డులు బద్ధలైయ్యాయి. ఆటగాళ్లు సైతం వ్యక్తిగత రికార్డులను తిరిగరాసుకున్నారు. ఐతే ఏ సీజన్‌లో నమోదు కాని సరికొత్త ఫీట్..ఐపీఎల్-2022లో నమోదు అయ్యింది.
తొలిసారి ఐపీఎల్ చరిత్రలో వెయ్యి సిక్సర్లు నమోదు అయ్యాయి. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో 15వ సీజన్ చరిత్ర సృష్టించింది. ఒకే సీజన్‌లో ఇన్ని సిక్సర్లు నమోదు కావడం ఇదే తొలిసారి. ఐపీఎల్ 2022లో వెయ్యి సిక్సర్ల ఫీట్ దాటింది. ఇంకా ప్లే ఆఫ్స్, ఫైనల్ ఉండటంతో మరిన్ని సిక్సర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈరికార్డు బద్దలైంది. పంజాబ్ హాట్ హిట్టర్ లివింగ్ స్టోన్ బ్యాట్ నుంచి జాలువారింది. అతడు బాదిన సిక్సర్ ..ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయింది.
అంతకముందు 2018లో 872 సిక్సర్లు నమోదు అయ్యాయి. ఈఏడాది వరకు అత్యధిక సిక్సర్ల రికార్డు ఇదే. ఆ ఫీట్‌ను ఐపీఎల్ 2022 బద్దలు కొట్టింది. ఈ సీజన్‌లో తొలి సిక్సర్‌ను చెన్నై ఆటగాడు రాబిన్ ఉతప్ప కొట్టాడు. 1000వ సిక్సర్‌ను లివింగ్ స్టోన్ బాదాడు. ఐపీఎల్ 2022లో లాంగెస్ట్ సిక్సర్ బాదిన రికార్డును సైతం లివింగ్ స్టోన్ సొంతం చేసుకున్నాడు. ఈసీజన్‌లో 117 మీటర్ల సిక్సర్‌ను లివింగ్ స్టోన్ మలిచాడు. టిమ్ డేవిడ్ 114 మీటర్లు, డెవాల్డ్ బ్రెవిస్ 112 మీటర్ల సిక్సర్‌ను కొట్టారు.
ఇక సిక్సర్ల విషయానికి వస్తే 2022లో వెయ్యికి పైగా సిక్సర్లు నమోదు అయ్యాయి. 2018 సీజన్ లో 872 సిక్సర్లు ఉన్నాయి. 2009లో అత్యల్పంగా 506 సిక్సర్లు నమోదు అయ్యాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్‌లో మరిన్ని భారీ సిక్సర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ప్లే ఆఫ్స్ పోరు కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపటి నుంచి కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. గుజరాత్, రాజస్థాన్, లక్నో,బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్‌కు ఉన్నాయి.
Also read:Intelligence Alert: దేశంలో విధ్వంసానికి పాక్ ఉగ్రవాదుల కుట్రలు..నిఘా రెట్టింపు చేసిన రాష్ట్రాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook