IPL 2022, Ajinkya Rahane 59 runs away from reaching 4000 run mark in IPL: మండు వేసవిలో రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ 2022 సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో మెగా లీగ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రోజు రాత్రి 7.30 గంటలకు ముంబైలోని వాంఖడే మైదానంలో జరగనుంది. దాంతో రెండు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్ నుంచి సీఎస్‌కే, కేకేఆర్ జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఈ మ్యాచుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
లీగ్ ఆరంభ మ్యాచులో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరగనున్న మ్యాచ్‌లో 4 వికెట్లు తీస్తే.. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక పేసర్ లసిత్ మలింగపై ఉంది. మలింగ 122 మ్యాచుల్లో 170 వికెట్లు తీశాడు. బ్రావో ఇప్పటివరకు 151 మ్యాచులు ఆడి 167 వికెట్లు పడగొట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ బ్యాటర్, తెలుగు తేజం అంబటి రాయుడు ఈ మ్యాచ్‌లో 84 పరుగులు చేస్తే.. ఐపీఎల్ టోర్నీలో 4000 పరుగులు పూర్తిచేస్తాడు. రాయుడు 175 గేమ్‌ల్లో 3916 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, డేవిడ్ వార్నర్, ఏబీ డెవిలియర్స్ ఐదు వేల పరుగులు చేశారు. 2018 ఐపీఎల్ సీజన్‌లో రాయుడు 602 పరుగుల భారీ స్కోర్ చేసి చెన్నై కప్పు కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు ముంబై జట్టుకి ఆడాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు, టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను ఓ రికార్డు ఊరిస్తోంది. ఐపీఎల్‌లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసేందుకు మరో 59 పరుగుల దూరంలో జింక్స్ ఉన్నాడు. రహానే 151 మ్యాచుల్లో 3941 పరుగులు చేశాడు. ఇక కోల్‌కతా బౌలర్ సునీల్ నరైన్ 143 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన బౌలర్ల ఎలైట్ క్లబ్‌కు చేరుకోవడానికి ఇంకా ఏడు దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచులో ఇది కష్టమైనా.. మరో 2-3 మ్యాచుల్లో ఆ మార్క్ అందుకోనున్నాడు.
Also Read: EPFO E-nomination: ఈ-నామినేషన్ దాఖలు అవసరం ఎంత? చేయకుంటే ఏమౌతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook