IPL 2022 new teams: ఐపిఎల్ 2022లో రెండు కొత్త ఫ్రాంచైజీలు.. Ahmedabad, Lucknow

Ahmedabad, Lucknow likely in IPL 2022 team list: ఐపిఎల్ 2022 లో కొత్త ఫ్రాంచైజీల నమోదు కోసం అక్టోబర్ 25న బిడ్డింగ్ ప్రక్రియ జరగనుండగా.. అందులో పాల్గొనేందుకు అదాని, జిందాల్ స్టీల్ లాంటి (Adani, Jindal steel & power) పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు పోటీపడుతున్నాయి. 

Written by - Pavan | Last Updated : Oct 22, 2021, 02:53 PM IST
IPL 2022 new teams: ఐపిఎల్ 2022లో రెండు కొత్త ఫ్రాంచైజీలు.. Ahmedabad, Lucknow

Ahmedabad, Lucknow likely in IPL 2022: ఐపిఎల్ 2022 మరింత ఎంటర్‌టైన్మెంట్ పంచనుందా అంటే అవుననే తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం 8 జట్లు ఉన్న ఐపిఎల్ టోర్నమెంట్‌లో వచ్చే ఏడాది సీజన్ నాటికి కొత్తగా మరో రెండు ఫ్రాంచైజీలు వచ్చి చేరనున్నాయని సమాచారం. ఎన్డీటీవీ ప్రచురించిన ఓ కథనం ప్రకారం ఐపిఎల్ 2020 ఫ్రాంచైజీల జాబితాలో అహ్మెదాబాద్, లక్నో నగరాల నుంచి రెండు కొత్త ఫ్రాంచైజీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

Adani Group and Glazer Family in race for Ahmedabad, Lucknow teams in IPL 2022: ఐపిఎల్ 2022 లో కొత్త ఫ్రాంచైజీల నమోదు కోసం అక్టోబర్ 25న బిడ్డింగ్ ప్రక్రియ జరగనుండగా.. అందులో పాల్గొనేందుకు పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు పోటీపడుతున్నాయి. అహ్మెదాబాద్ ఫ్రాంచైజీని చేజిక్కించుకునేందుకు అదాని గ్రూప్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా బీసీసీఐ అధికార వర్గాలు (BCCI) వెల్లడించినట్టుగా ఎన్డీటీవీ కథనం పేర్కొంది. అలాగే మాంచెస్టర్ యునైటెడ్ యజమాని అయిన గ్లేజర్ ఫ్యామిలీ సైతం బిడ్డింగ్ పేపర్స్ తీసుకున్నట్టు సమాచారం.

Also read : 8 sixes in one over : ఆస్ట్రేలియా బ్యాటర్ విధ్వంసం... ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు బాదేశాడు..!

IPL 2022 new franchises bidding- కొత్త ఫ్రాంచైజీల నమోదు కోసం చేపట్టే బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్న కంపెనీలు జాబితా ఇలా ఉంది. 

సంజీవ్ కుమార్- ఆర్పీఎస్జీ.

గ్లేజర్ ఫ్యామిలీ - మాంచెస్టర్ యునైటెడ్ ఓనర్స్ (Glazer Family).

అదాని గ్రూప్ (Adani Group).

నవీన్ జిందాల్ - జిందాల్ స్టీల్ అండ్ పవర్.

టోరెంట్ ఫార్మా.

రోనీ స్క్రూ వావా.

అరబిందో ఫార్మా.

కొటక్ గ్రూప్.

సీవీసీ పార్టనర్స్.

హిందుస్థాన్ టైమ్స్ మీడియా.

Also read : Pakistan top cricketers and their wives: తమ భార్యలతో కలిసి కెమెరాకు ఫోజిచ్చిన పాకిస్థాన్ టాప్ క్రికెటర్స్

పీటీఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఐపిఎల్ టీమ్ బిడ్డింగ్ ద్వారా రూ. 7000 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని బీసీసీఐ (BCCI about IPL 2022 income) అంచనా వేస్తోంది. కనీసం 3000 వేల కోట్ల వార్షిక ఆదాయం ఉన్న కంపెనీలకే ఈ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉండగా.. బిడ్డింగ్ కోసమే కనీసం రూ. 2 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. బిడ్డింగ్ కోసం అవసరమయ్యే 'ఇన్విటెషన్ టు టెండర్' పేరిట లభించే డాక్యుమెంట్‌ని కొనుగోలు చేయడానికే రూ. 10 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Also read : T20 World Cup 2021: IND Vs PAK మ్యాచ్‌ల్లో అతి పెద్ద కాంట్రావర్శీలు, ఎప్పటికీ గుర్తుండే హైలైట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News