IPL 2022: ప్లే ఆఫ్ చేరిన లక్నోసూపర్ జెయింట్స్.. కోల్ కతాపై ఘన విజయం

IPL 2022: ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్  సూపర్ విక్టరి కొట్టింది. అద్భుత ప్రదర్శనతో కోల్ కత్ నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. ఏకంగా 75 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. లక్నో విధించిన 177 పరుగుల టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన కోల్ కతా.. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2022, 07:26 AM IST

    కోల్ కతాపై లక్నో సూపర్ జెయింట్స్ విన్

    ప్లే ఆఫ్ చేరిన లక్నో సూపర్ జెయింట్స్

    ముంబై ఇండియన్స్ ఆశలు గల్లంతు

IPL 2022: ప్లే ఆఫ్ చేరిన లక్నోసూపర్ జెయింట్స్.. కోల్ కతాపై ఘన విజయం

IPL 2022: ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్  సూపర్ విక్టరి కొట్టింది. అద్భుత ప్రదర్శనతో కోల్ కత్ నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. ఏకంగా 75 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. లక్నో విధించిన 177 పరుగుల టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన కోల్ కతా.. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. లక్నో పేసర్లు అవేష్ ఖాన్, హోల్డర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన కోల్ కతా...  14.3 ఓవర్లలో కేవలం 101 పరుగులకే కుప్పకూలింది.

లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్, హోల్డర్ తలా మూడు వికెట్లు సాధించారు. కోల్ కతా బ్యాటర్లలో రస్సెల్ ఒక్కడే రాణించాడు. రస్సెల్ 45 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోల్ కతా బ్యాటర్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ స్కోరే చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అవేష్ ఖాన్ ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. ఓపెనన్ డీకాక్ చెలరేగిపోయాడు. కేవలం 29 బంతుల్లోనే 50 రన్స్ చేశాడు. దీపక్ హుడా 41 పరుగులు, స్టొయినిస్ 28 పరుగులు చేసి రాణించారు.

తాజా విజయంతో లక్నో 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖాయం చేసుకుంది.  అటు తాజా ఓటమితో కోల్ కతా ప్లే ఆఫ్స్ బెర్త్ దారులు మూసుకుపోయినట్లే. మరోవైపు ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తొలి అధికారిక జట్టు ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన ముంబై..  రెండు  మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ముంబై ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. శనివారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై రాజస్థాన్ విజయం సాధించింది. పంజాబ్ పై విజయంతో 14 పాయింట్లకు చేరిన రాజస్థాన్  పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. దీంతో ప్లే ఆఫ్ నాలుగో బెర్త్ దక్కించుకోవాలంటే.. కనీసం 12 పాయింట్లు ఉండాల్సిందే. ఈ లెక్కన ముంబై తాను ఆడాల్సిన మిగితా నాలుగు మ్యాచ్ లు గెలిచినా.. 12 పాయింట్లే ఉంటాయి. దీంతో ముంబై ప్లే ఆఫ్ ఆశలు లేనట్టే.  

IPL 2022 RCB vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటములకు పుల్ స్టాప్ పడుతుందా.. లేక ఆర్సీబీ చేతిలో కూడా ఓడిపోతుందా..?

IPL 2022 Play Off Chances: మారుతున్న ఐపీఎల్ సమీకరణాలు.. ఎవరెవరికి ప్లే ఆఫ్ అవకాశాలు.. ??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News