KKR vs MI: ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ మరోసారి ఓటమి పాలైంది. సులభమైన లక్ష్యాన్ని ఛేధించలేక కుప్పకూలింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2022లో మరో కీలకమైన మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ప్రారంభమైంది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది ముంబై ఇండియన్స్. పిచ్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా 50 పరుగులు దాటించి శుభారంభాన్నిచ్చారు. ఆ దశలో 24 బంతుల్లో 43 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్..కార్తికేయ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. ఇక ఆ తరువాత కేకేఆర్ వికెట్ల పతనం ప్రారంభమైంది. రహానే 25 పరుగులు చేసి అవుట్ కాగా, 123 పరుగుల టీమ్ స్కోరు వద్ద మూడవ వికెట్ కోల్పోయింది. మరి కాస్సేపటికి అంటే 136 పరుగుల వద్ద రస్సెల్ రూపంలో నాలుగవ వికెట్ పడింది. 26 బంతులు ఎదుర్కొని 43 పరుగులతో స్కోర్ పెంచేందుకు ప్రయత్నించిన నితీష్ రానా 5వ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 156 పరుగుల స్కోర్ వద్ద 8 వికెట్లు కోల్పోయింది.
ఇక ఆ తరువాత 166 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగులకే వెనుదిరిగాడు. 5వ ఓవర్లో 32 పరుగుల టీమ్ స్కోర్ వద్ద తిలక్ వర్మ రస్సెల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ చాలారోజుల తరువాత ఫామ్‌లో వచ్చాడు. 41 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. అటు 5వ వికెట్‌గా వచ్చిన పోలార్డ్ ధాటిగా ఆడటం ప్రారంభించాడు. 15 వ ఓవర్లో ఇషాన్ కిషన్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. 5 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. ఆ తరువాత బరిలో దిగిన శామ్స్ కూడా వెంటనే వెనుదిరిగాడు. 102 పరుగులకు ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అదే ఓవర్లో అశ్విన్ కూడా అవుటవడంతో 7వ వికెట్ కోల్పోయింది. ఇక అక్కడ్నించి ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ స్లో అయిపోయింది. 17వ ఓవర్ చివర్లో 8వ వికెట్ రనౌట్‌గా కార్తికేయ వెనుదిరిగాడు. ఆ వెంటనే 18వ ఓవర్ లో పోలార్డ్ కూడా రనవుట్గా వెనుదిరగడంతో ఇక ముంబై ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. పదవ వికెట్ కూడా వెంటనే రనవుట్ కావడంతో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. 113 పరుగులకు ఆలవుట్ అయింది. 52 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది.
Also read: CSK vs DC: ఓల్డ్ మ్యాన్ బాగా ఆపావు.. చెన్నై స్టార్ ఆటగాడిని ట్రోల్ చేసిన ఎంఎస్ ధోనీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook