GT vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ.. ముస్తాఫిజుర్ వచ్చేశాడు! తుది జట్లు ఇవే

IPL 2022, GT vs DC Playing 11 Out. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మరికొద్ది సేపట్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2022, 07:35 PM IST
  • టాస్ గెలిచిన ఢిల్లీ
  • ముస్తాఫిజుర్ వచ్చేశాడు
  • తుది జట్లు ఇవే
GT vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ.. ముస్తాఫిజుర్ వచ్చేశాడు! తుది జట్లు ఇవే

IPL 2022, GT vs DC Playing 11 is Out: ఐపీఎల్ 2022లో భాగంగా ఈరోజు డబుల్ హెడర్స్ ఉన్న విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మరికొద్ది సేపట్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ కోసం పంత్ తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. మరోవైపు గుజరాత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు హార్దిక్ పాండ్యా చెప్పాడు. కమలేష్ నాగరకోటి స్థానంలో ముస్తాఫిజుర్ రెహమాన్ జట్టులోకి వచ్చాడు. 

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. తొలిసారి ఐపీఎల్ ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ మొదటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. దాంతో రెండు జట్లు రెండో విజయంపై కన్నేశాయి. పాయింట్ల పట్టికలో ఢిల్లీ మూడో స్థానంలో ఉండగా.. గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. ఇరు జట్లకు రెండు పాయింట్స్ ఉన్నా.. నెట్ రన్ రేట్ పరంగా ఢిల్లీ ముందుంది.

తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్ (కెప్టెన్/కీపర్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్.
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్, మాథ్యూ వేడ్ (కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ. 

Also Read: Beast Movie Trailer: విజయ్ దళపతి 'బీస్ట్' మూవీ ట్రైలర్ వచ్చేసింది!

Also Read: Ugadi 2022: ఉగాది నాడు ముస్లిం భక్తులతో కిటకిటలాడుతున్న వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఎక్కడో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News