IPL 2022 Captains List: కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై.. ఈసారి నలుగురు కొత్తవారికి సారథ్యం! 10 జట్ల కెప్టెన్‌ల జాబితా ఇదే!!

IPL 2022 Captains List. రవీంద్ర జడేజాతో పాటుగా ఫాఫ్ డుప్లెసిస్‌, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్‌లు కూడా ఐపీఎల్ 2022లో తొలిసారిగా సారథ్యం వహించనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 02:39 PM IST
  • కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై.
  • ఈసారి నలుగురు కొత్తవారికి సారథ్యం
  • 10 జట్ల కెప్టెన్‌ల జాబితా ఇదే
 IPL 2022 Captains List: కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై.. ఈసారి నలుగురు కొత్తవారికి సారథ్యం! 10 జట్ల కెప్టెన్‌ల జాబితా ఇదే!!

IPL 2022, Full list of Captains for the 10 franchises: క్రికెట్ అభిమానులకు వేసివి వినోదం అందించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో మెగా లీగ్ ఆరంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్ల మధ్య శనివారం (మార్చి 26) జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ మొదలు కానుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం అవనుంది. లీగ్ ఆరంభ మ్యాచ్ చూసేందుకు ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఖాళీ మైదానల్లో జరిగిన ఐపీఎల్.. ఈసారి పరిమిత సంఖ్యలో ప్రేక్షకుల మధ్య జరగనుండం అభిమానులకు కాసంత ఉపశనం కలిగించే అంశం.

ఐపీఎల్ 2022ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి.. అభిమానులకు భారీ షాకిచ్చాడు. కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై చెప్పడంతో రవీంద్ర జడేజాకు చెన్నై సారథ్య బాధ్యతలు అప్పగించారు ప్రాంచైజీ యాజమాన్యం. దాంతో ఐపీఎల్ చరిత్రలో జడ్డు తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. 

రవీంద్ర జడేజాతో పాటుగా ఫాఫ్ డుప్లెసిస్‌, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్‌లు కూడా తొలిసారిగా సారథ్యం వహించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అనుభవమున్న డుప్లెసిస్‌కు ఇప్పటివరకు కెప్టెన్సీ అవకాశం రాలేదు. విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఫాఫ్ కెప్టెన్ అయ్యాడు. కొత్త ప్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌ను హార్దిక్ నడిపించనున్నాడు. పంజాబ్ నుంచి కేఎల్ రాహుల్ వెళ్లిపోవడంతో మయాంక్ జట్టు బాధ్యతలు అందుకున్నాడు. రాహుల్ గైర్హాజరీలో ఇదివరకు అతడు ఓ మ్యాచుకు సారథ్యం వహించాడు. 

ఐపీఎల్ 2022 కెప్లెన్లు:
రోహిత్ శర్మ
శ్రేయస్ అయ్యర్
కేన్ విలియమ్సన్
కేఎల్ రాహుల్
రిషబ్ పంత్
సంజూ శాంసన్
మయాంక్ అగర్వాల్
రవీంద్ర జడేజా
ఫాఫ్ డుప్లెసిస్
హార్దిక్ పాండ్యా 

Also Read: RRR Movie Collections: ఆర్‌ఆర్‌ఆర్‌ తొలిరోజు కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాకే!!

Also Read: RRR Effect: మల్టీప్లెక్స్ ఇండస్ట్రీకి కలిసొచ్చిన ఆర్ఆర్ఆర్ రిలీజ్... 25 నెలల గరిష్ఠానికి స్టాక్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News