IPL 2022: అర్ధరాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై దాడి... ఐదుగురి అరెస్ట్...

Attack on Delhi Capitals Bus: నవనిర్మాణ్ సేనకు చెందిన దాదాపు 12 మంది కార్యకర్తలు బస్సుపై దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. బస్సు పార్క్ చేసిన తాజ్ ప్యాలెస్‌ వద్దకు చేరుకుని ఐపీఎల్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 05:59 PM IST
  • ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై దాడి
  • మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘటన
  • నవనిర్మాణ్ సేన కార్యకర్తల దాడి, బస్సు అద్దాల ధ్వంసం
 IPL 2022: అర్ధరాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై దాడి... ఐదుగురి అరెస్ట్...

Attack on Delhi Capitals Bus: ఐపీఎల్ ప్రారంభానికి అంతా సిద్ధమవుతున్న వేళ.. ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు చెందిన బస్సుపై దాడి జరగడం కలకలం రేపుతోంది. ముంబైలో మంగళవారం (మార్చి 15) అర్ధరాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌ బస్సుపై రాజ్ థాక్రే నేత్రుత్వంలోని నవనిర్మాణ్ సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అయితే ఆ సమయంలో బస్సులో ఆటగాళ్లెవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

నవనిర్మాణ్ సేనకు చెందిన దాదాపు 12 మంది కార్యకర్తలు బస్సుపై దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. బస్సు పార్క్ చేసిన తాజ్ ప్యాలెస్‌ వద్దకు చేరుకుని ఐపీఎల్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు కొన్ని పోస్టర్లను అంటించారు. నవనిర్మాణ్ సేన నేత సంజయ్ నాయక్ మాట్లాడుతూ.. ఐపీఎల్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి బస్సులను తీసుకున్నారని... ఓవైపు స్థానికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే ఇలా బయటి రాష్ట్రాల నుంచి బస్సులు తీసుకురావడమేంటని ప్రశ్నించారు.

ఓవైపు తాము నిరసన తెలుపుతున్నా ఐపీఎల్ యాజమాన్యం ఢిల్లీ, ఇతర రాష్ట్రాల నుంచి బస్సులను తీసుకొస్తోందన్నారు. ఇది మరాఠీ ప్రజల ఉపాధిని దెబ్బతీస్తోందని.. అందుకే దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్ బస్సుపై దాడికి సంబంధించి కొలాబా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 143, 147, 149, 427ల కింద కేసు నమోదు చేసి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కాగా, ఈ నెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఢిల్లీ క్యాపిటల్ టీమ్ తాజ్ ప్యాలెస్‌లో బస చేయనుంది. మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. బ్రబోర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. 

Also Read: APSRTC Concession: 60 ఏళ్ల వయసు దాటిన వారికి ఆర్టీసీలో 25 శాతం రాయితీ!!

Also Read: Ganta Srinivasarao: స్పీకర్ గారూ..ఏడాదిగా పెండింగ్ లో ఉంది.. నా రాజీనామా ఆమోదించండి..: గంటా శ్రీనివాసరావు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News