Prithvi Shaw Yo Yo Test: యో-యో టెస్ట్‌లో పృథ్వీ షా ఫెయిల్‌.. అయినా కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతాడు!!

Prithvi Shaw Fails to Clear Yo-Yo Test. ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్ ఓపెనర్, టీమిండియా ప్లేయర్ పృథ్వీ షా ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమయ్యాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 12:57 PM IST
  • యో-యో టెస్ట్‌లో పృథ్వీ షా ఫెయిల్‌
  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ షా ఆడుతాడు
  • కేవలం ఫిట్‌నెస్‌కు ఓ కొలమానం మాత్రమే
Prithvi Shaw Yo Yo Test: యో-యో టెస్ట్‌లో పృథ్వీ షా ఫెయిల్‌.. అయినా కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతాడు!!

Delhi Capitals player Prithvi Shaw Fails to Clear Yo-Yo Test ahead of IPL 2022: ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్ ఓపెనర్, టీమిండియా ప్లేయర్ పృథ్వీ షా ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమయ్యాడు. ఐపీఎల్ 2022కి ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో బుధవారం నిర్వహించిన యో-యో టెస్టులో షా ఫెయిల్ అయ్యాడు. భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ప్రమాణికంగా భావించే యో-యో టెస్టులో ఢిల్లీ ఓపెనర్ 15 కంటే తక్కువ స్కోర్ చేశాడట. యో-యో టెస్ట్‌లో బీసీసీఐ నిర్దేశించిన కనీస స్కోర్‌ 16.5 అన్న సంగతి తెలిసిందే. 

ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అయినా ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున పృథ్వీ షా ఆడనున్నాడు. ఇది కేవలం ఫిట్‌నెస్ టెస్ట్ మాత్రమే అని, ఇందులో విఫలమైతే ఐపీఎల్‌లో ఆడకుండా ఆపలేమని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. 'ఇటీవల కాలంలో పృథ్వీ షా ఫిట్‌నెస్‌ ఆశించిన స్థాయిలో లేదు. యో-యో టెస్టులో షా విఫలమైనా ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికీ అతడు ఐపీఎల్‌లో ఆడవచ్చు. ఇది కేవలం ఫిట్‌నెస్‌కు ఓ కొలమానం మాత్రమే. ఇటీవల షా వరుసగా మూడు రంజీ మ్యాచులు ఆడాడు. అది కూడా యో-యో స్కోరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది' అని బీసీసీఐ అధికారి అన్నారు. 

బీసీసీఐ తమ కాంట్రాక్టు ప్లేయర్లతో పాటు ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లకు ఇటీవలే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించింది. ఈ క్యాంప్‌కు హాజరు కానీ ఆటగాళ్లకు మళ్లీ పరీక్షలు నిర్వహించింది. ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో పృథ్వీ షా లేకపోవడంతోనే అతడిని ఐపీఎల్ ఆడేందుకు అనుమతిచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. బీసీసీఐ అనుమతిచ్చినా షా ఫిట్‌నెస్ ఢిల్లీ జట్టును కలవరపెడుతోంది. యోయో టెస్ట్ క్లియర్ చేయలేని అతడు ఐపీఎల్ మ్యాచ్‌లు ఏం ఆడుతాడో అని భావిస్తోంది. 

మరోవైపు వెన్నెముక గాయం కారణంగా టీమిండియాకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా యో-యో టెస్టు పాసయ్యాడు. బుధవారం నిర్వహించిన యో-యో టెస్టులో ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేసి.. 17కి పైగా స్కోరు సాధించాడు. దాంతో ఐపీఎల్ టోర్నీలోకి కొత్తగా అడుగు పెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు హార్దిక్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హార్థిక్ చాలా ఏళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. గత కోనేళ్ళుగా అంతంత మాత్రంగానే ఆడుతున్న హార్దిక్.. ఆల్‌రౌండర్‌ (కెప్టెన్, బ్యాటర్, బౌలర్)గా ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. 

Also Read: RRR First Review: ఇండియా బాక్సాఫీస్‌ షేక్ అవుతుంది.. 3 వేల కోట్లు పక్కా! ఇది రాసిపెట్టుకోండి.. ఆర్ఆర్ఆర్ తొలి రివ్యూ!!

Also Read: Harmanpreet Kaur: వావ్.. వాట్ ఏ క్యాచ్ హర్మన్‌ప్రీత్! బహుశా జాంటీ రోడ్స్ కూడా పట్టడేమో (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News