IPL 2022, CSK vs KKR Match Turning Point: ఐపీఎల్ 2022 తొలి మ్యాచులోనే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి షాక్ తగిలింది. శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమయిన చెన్నై లీగ్‌ను పేలవంగా ఆరంభించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఎంఎస్ ధోనీ (50 నాటౌట్) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అజింక్య రహానే (44) టాప్ స్కోరర్.
కెప్టెన్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కారణమయ్యాడు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (0), దేవాన్ కాన్వె (3) విఫలమయ్యారు. ఐపీఎల్ 2021లో మెరుపు ఆరంభాలు ఇచ్చిన రుతురాజ్.. ఈ మ్యాచులో డకౌట్ అయ్యాడు. ఇక కాన్వె చాలా సమయం క్రీజులో ఉన్నా.. పరుగులు మాత్రం చేయలేదు. ఈ సమయంలో సీనియర్ ప్లేయర్స్ రాబిన్ ఉతప్ప (28: 21 బంతుల్లో 2x4, 2x6), అంబటి రాయుడు (15: 17 బంతుల్లో 1x4, 1x6) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 28 పరుగులు చేసిన ఉతప్ప.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బుట్టలో పడి పెవిలియన్ చేరాడు.
అంబటి రాయుడు గేర్ మార్చే ప్రయత్నంలో ఉండగా.. లేనిపరుగు కోసం ప్రయత్నించిన రవీంద్ర జడేజా అతడిని ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ నాలుగో బంతిని సునీల్ నరైన్ వేయగా.. జడేజా బంతిని మిడ్ వికెట్ దిశగా ఫుష్ చేశాడు. సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని రాయుడిని పిలవగా.. అతను పరుగు అందుకున్నాడు. అయితే బంతి శ్రేయాస్ అయ్యర్ వద్దకి వెళ్లడంతో.. జడేజా తా నిర్ణయం మార్చుకుని రాయుడిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు. అప్పటికే పిచ్ మధ్యలోకి వెళ్లిపోయిన తెలుగు తేజం.. వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే బంతిని అందుకున్న శ్రేయాస్.. నరైన్‌కి విసరగా అతడు బెయిల్స్ ఎగరగొట్టాడు. ఇంకేముంది రాయుడు నిరాశగా పెవిలియన్ చేరాడు.
అంబటి రాయుడు రనౌట్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పరుగులు చేయలేకపోయింది. శివమ్ దూబె (3) త్వరగానే ఔట్ అవ్వగా.. చాలా సమయం క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ 7-8 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు. చివరలో మహీ చెలరేగినా ఆ స్కోర్ సరిపోలేదు. రాయుడు పెవిలియన్ చేరడమే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. రాయుడు క్రీజులో ఉంటే.. చెన్నై భారీ స్కోర్ చేసేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. ఏదేమైనా జడేజా ఆ జట్టు ఓటమికి కారణమయ్యాడు.
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ హాఫ్ సెంచరీ.. రాహుల్ ద్రవిడ్ రికార్డు బద్దలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook