Ambati Rayudu Injury: చెన్నైకి మరో ఎదురుదెబ్బ.. అంబటి రాయుడు కూడా..!

CSK Coach Stephen Fleming about Ambati Rayudu injury. ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా రాణిస్తోన్న తెలుగు తేజం అంబటి రాయుడు గాయం బారిన పడ్డాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 08:05 PM IST
  • చెన్నైకి మరో ఎదురుదెబ్బ
  • అంబటి రాయుడు కూడా
  • పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో చెన్నై
Ambati Rayudu Injury: చెన్నైకి మరో ఎదురుదెబ్బ.. అంబటి రాయుడు కూడా..!

CSK player Ambati Rayudu injured while fielding against PBKS: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ 2022 సీజన్ ఏమాత్రం కలిసి రావడం లేదు. లీగ్ ఆరంభం నుంచి గాయాలు, వరుస ఓటములు ఆ జట్టును వెంటాడనున్నాయి. ఆరు ఓటములతో ఇప్పటికే ఫ్లే ఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న చెన్నైకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా రాణిస్తోన్న తెలుగు తేజం అంబటి రాయుడు గాయం బారిన పడ్డాడు. సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు గాయం మరింత ఎక్కువైందని చెన్నైహెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తెలిపాడు.

'పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అప్పటికే అతడికి గాయమైంది. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. జట్టు కోసం గాయంతోనే బ్యాటింగ్ కొనసాగించాడు. దాంతో గాయం తీవ్రత మరింత ఎక్కువైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మ్యాచ్‌ సమయానికి రాయుడు కోలుకుంటాడన్న నమ్మకం లేదు. ప్రస్తుతం అతడికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. చూడాలి మరి' అని చెన్నైహెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ చెప్పాడు. కోచ్ బట్టి చెన్నై ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు రాయుడు అందుబాటులో ఉండడని అర్ధమవుతోంది. 

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌ 11 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. 188 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై 6 వికెట్ల నష్టానికి 176 పరుగులే చేసింది. అంబటి రాయుడు (78 నాటౌట్; 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. అయితే అతడి పోరాటం సరిపోలేదు. 15వ సీజన్‌లో రాయుడు 8 మ్యాచ్‌ల్లో 35.14 సగటుతో 246 రన్స్ చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 78.

గాయాల కారణంగా పేసర్లు దీపక్‌ చహర్‌, ఆడమ్‌ మిల్నే సేవలను చెన్నై సూపర్ కింగ్స్‌ కోల్పోయింది. ఇద్దరు టాప్ ఆటగాళ్లు దూరమవడంతో చెన్నై పేస్ బౌలింగ్ బలహీన పడింది. ముకేశ్ చౌదరి, డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావోలతో చెన్నై నెట్టుకొస్తోంది. మంచి ఫామ్‌లో ఉన్న మొయిన్ అలీ కూడా గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. తాజాగా అంబటి రాయుడు కూడా దూరమయ్యాడు. రాయుడు లేని ప్రభావం చెన్నైపై పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై రెండు మ్యాచ్‌లు గెలిచి.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగతా అన్ని మ్యాచులు గెలవాలి. 

Also Read: CSK Fan Girl: అంబటి రాయుడు భారీ సిక్సులు.. వైరల్‌గా మారిన చెన్నై ఫ్యాన్ గర్ల్ రియాక్షన్! ఆమె మరెవరో కాదు

Also Read: Ram Charan Fans: హద్దులు దాటిన మెగా అభిమానం.. దుర్గగుడిలో అపచారం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News