CSK Fan Girl: అంబటి రాయుడు భారీ సిక్సులు.. వైరల్‌గా మారిన చెన్నై ఫ్యాన్ గర్ల్ రియాక్షన్! ఆమె మరెవరో కాదు

CSK Fan Girl Shruti Tuli Reactions. అంబటి రాయుడు కొట్టిన సిక్సులకు చెన్నై సూపర్ కింగ్స్‌ లేడీ ఫ్యాన్ శ్రుతి తులి తెగ ఆనందపడ్డారు. డాన్స్, కేకలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 07:06 PM IST
  • రాయుడు భారీ సిక్సులు
  • వైరల్‌గా మారిన చెన్నై ఫ్యాన్ గర్ల్ రియాక్షన్
  • అసిమ్ రియాజ్‌తో శ్రుతి డేటింగ్
CSK Fan Girl: అంబటి రాయుడు భారీ సిక్సులు.. వైరల్‌గా మారిన చెన్నై ఫ్యాన్ గర్ల్ రియాక్షన్! ఆమె మరెవరో కాదు

CSK Fan Girl Shruti Tuli Reaction goes Viral after Ambati Rayudu hits Sixes: ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. చివరి ఓవర్ వరకు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్‌ నిర్ధేశించిన 188 పరుగుల లక్ష్య ఛేదనలో జడేజా సేన 6 వికెట్ల నష్టానికి 176 పరుగులకే పరిమితమైంది. తెలుగు తేజం అంబటి రాయుడు (78 నాటౌట్; 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేసినా.. మిగతా ఆటగాళ్ల వైఫల్యంతో చెన్నైకి ఓటమి తప్పడలేదు. 

ఈ మ్యాచులో అంబటి రాయుడు 6 సిక్సులు బాదిన విషయం తెలిసిందే. ప్రతి సిక్స్ కూడా స్టేడియంలోకి దూసుకెళ్లింది. దాంతో మైదానంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్ డాన్స్, అరుపులతో సందడి చేశారు. ఈ క్రమంలో ఓ చెన్నై లేడీ ఫ్యాన్ తెగ సంబరపడిపోయారు. రాయుడు కొట్టిన సిక్సులకు తెగ ఆనందపడ్డారు. డాన్స్, కేకలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆమె ఇచ్చిన రియాక్షన్స్‌ను కెమెరా మెన్స్ స్క్రీన్‌పై ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

పసుపు రంగు టాప్‌, బ్లు జీన్స్ వేసుకొచ్చిన ఆ చెన్నై ఫ్యాన్ గర్ల్ మరెవరో కాదు.. నటి శ్రుతి తులి. 2013లో మిస్ ఇండియా దివా అందాల పోటీలో శ్రుతి తన కెరీర్‌ను ప్రారంభించారు. నటిగానే కాకుండా మోడల్‌గా కూడా పాపులర్ అయ్యారు. మిస్ యూనివర్స్ ఇండియా బ్యూటీ ఈవెంట్‌లో 3వ స్థానంలో నిలిచారు. పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కూడా ఆమె చేశారు. బిగ్ బాస్ 13 కంటెస్టెంట్ అయిన అసిమ్ రియాజ్‌తో శ్రుతి డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shruti Tuli (@shrutituli)

చెన్నై సూపర్ కింగ్స్‌ మ్యాచ్ సందర్భంగా శ్రుతి తులి ముంబైలోని వాంఖడే స్టేడియంలో పలు ఫొటోలు దిగారు. వాటిని శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'నేను ఆశించిన ఫలితం ఇది కాదు.. కానీ ప్రతి నిమిషంను ఎంజాయ్ చేశా' అని నటి శ్రుతి తులి పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రుతి తులి ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. చెన్నై ఫ్యాన్ గర్ల్ అందాలకు ప్రతిఒక్కరు ఫిదా అవుతున్నారు. గతంలో కూడా పమ్యాచుల సందర్భంగా పలువురు మిస్టరీ గర్ల్ హైలెట్ అయిన విషయం తెలిసిందే. 

Also Read: Ram Charan Fans: హద్దులు దాటిన మెగా అభిమానం.. దుర్గగుడిలో అపచారం!

Also Read: Hombale Films New Movie: కేజీఎఫ్ మేక‌ర్స్ భారీ స‌ర్‌ప్రైజ్.. యువరాజ్‌తో కొత్త సినిమా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News