IPL 2022 Auction: ఐపీఎల్ 2022 వేలం జాబితా విడుదల.. అందుబాటులో స్టార్ ప్లేయర్స్!!

ఐపీఎల్ 2022 వేలం కోసం 1214 మంది తమ పేరును నమోదుచేసుకోగా.. షార్ట్ లిస్ట్ చేసిన జాబితాను బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. మెగా వేలంలో 590 మంది క్రికెటర్లు బరిలో ఉన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 05:03 PM IST
  • ఫిబ్రవరి 12 మరియు 13 తేదీల్లో వేలం
  • ఐపీఎల్ 2022 వేలం జాబితా విడుదల
  • మెగా వేలంలో పాల్గొనబోయేది వీళ్లే
IPL 2022 Auction: ఐపీఎల్ 2022 వేలం జాబితా విడుదల.. అందుబాటులో స్టార్ ప్లేయర్స్!!

IPL 2022 Auction Player List Announced: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం ఫిబ్రవరి 12 మరియు 13 తేదీల్లో బెంగళూరులో జరగనుందని మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. రెండు రోజుల పాటు జరిగే మెగా వేలంలో 590 మంది క్రికెటర్లు బరిలో ఉన్నారు. ఐపీఎల్ 2022 వేలం కోసం 1214 మంది తమ పేరును నమోదుచేసుకోగా.. షార్ట్ లిస్ట్ చేసిన జాబితాను బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. 

బీసీసీఐ ప్రకటించిన 590 మంది ఆటగాళ్లలో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. మరో 7 మంది అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు ఉన్నారు. 2 కోట్లు కనీస ధరలో 48 మంది ఆటగాళ్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. 1.5 కోట్ల కనీస ధరలో 20 మంది ఆటగాళ్లు, ఒక కోటి కనీస ధరలో 34 మంది ప్లేయర్స్ ఉన్నారు. మిగతావారు తమ బేస్‌ ప్రైస్‌ను కోటి కంటే తక్కువగా పేర్కొన్నారు.

శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, అజింక్య రహానే, సురేశ్ రైనా, యుజ్వేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేష్‌ యాదవ్‌ లాంటి భారత స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ 2022 వేలంలో ఉన్నారు. వీరందరూ హాట్ కేకుల్లా అమ్ముడయ్యే అవకాశం ఉంది.

ఇక విదేశీ జాబితాలో ఫాఫ్ డుప్లెసిస్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, కగిసో రబడ, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్, జానీ బెయిర్‌స్టో, జాసన్ హోల్డర్, డ్వేన్ బ్రావో, షకీబ్ అల్ హసన్, వనిందు హసరంగా వంటి స్టార్లు ఐపీఎల్ 2022 వేలంలో ప్రాంచైజీలకు అందుబాటులో ఉన్నారు. డుప్లెసిస్, వార్నర్, కమిన్స్, బ్రావో, రబడలు భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: West Indies Super Over: సూపర్ ఓవ‌ర్‌లో దంచికొట్టిన విండీస్ మహిళా ప్లేయర్స్.. పురుషులు కూడా అన్ని పరుగులు చేయలేదు!

Also Read: Union Budget 2022: ముగిసిన ఆర్ధిక మంత్రి ప్రసంగం.. బడ్జెట్ 2022లోని హైలైట్స్ ఇవే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News