IPL 2021 Sunrisers Hyderabad: వచ్చే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు వీరే..

IPL 2021 Sunrisers Hyderabad Full List of Players: సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చే ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతోంది. విదేశీ ఆటగాళ్లతో కొందరు దేశీయ ఆటగాళ్లను వదులుకుంది. ఫిబ్రవరిలో జరగనున్న ఐపీఎల్ 2021 వేలంలో పాల్గొనేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధంగా ఉంది. తెలుగు తేజం యర్రా పృథ్వీరాజ్‌లను సైతం వచ్చే సీజన్ నుంచి వదులుకుంటన్నట్లు ప్రకటించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 21, 2021, 02:45 PM IST
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో స్థిరంగా రాణిస్తున్న జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి
  • గతంలో దక్కన్ ఛార్జర్స్‌గా ఉన్న సమయంలో ఓ టైటిల్ సాధించిన హైదరాబాద్ జట్టు
  • సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మరో ఐపీఎల్ ట్రోఫీ సాధించింది
IPL 2021 Sunrisers Hyderabad: వచ్చే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు వీరే..

IPL 2021 Sunrisers Hyderabad Full List of Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) స్థిరంగా రాణిస్తున్న జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటని చెప్పవచ్చు. గతంలో దక్కన్ ఛార్జర్స్‌గా ఉన్న సమయంలో ఓ టైటిల్ సాధించిన హైదరాబాద్ జట్టు.. సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మరో ఐపీఎల్ ట్రోఫీ సాధించింది. అనంతరం రెండు పర్యాయాలు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న జట్టు ఎస్ఆర్‌హెచ్. IPL 2021 వేలం కోసం ఇతర జట్ల లాగ హైదరాబాద్ సైతం పలు మార్పులకు సిద్ధమైంది.

జనవరి 20వ తేదీలోగా వేలం కోసం రిలీజ్ చేసే ఆటగాళ్లు, రిటైన్ చేసుకునే ప్లేయర్స్ జాబితాను అందించాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని జట్లు జనవరి 20న తమ వద్ద ఉన్న ఆటగాళ్లు, రిలీజ్ చేసిన ఆటగాళ్ల వివరాలు తెలిపాయి. 

Also Read: IPL 2021 Rajasthan Royals: సంజూ శాంసన్‌కు ప్రమోషన్.. స్టీవ్ స్మిత్‌కు షాక్!

సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఫ్రాంచైజీ బిల్లీ స్టాన్‌లేక్, ఫాబియన్ అలెన్ లాంటి విదేశీ ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వీరితో పాటు దేశీయ ఆటగాళ్లు సంజయ్ యాదవ్, బి సందీప్, తెలుగు తేజం యర్రా పృథ్వీరాజ్‌లను సైతం వచ్చే సీజన్ నుంచి వదులుకుంటన్నట్లు ప్రకటించింది.

Also Read: Rishabh Pant: గబ్బాలో సూపర్ ఇన్నింగ్స్.. రిషబ్ పంత్ అరుదైన ఘనత 

 

 

 

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్డ్ ప్లేయర్స్ వీరే... (SunRisers Retained Players for IPL2021)
డేవిడ్ వార్నర్(David Warner) (కెప్టెన్), కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, ప్రియం గార్గ్, విరాట్ సింగ్, వృద్దిమాన్ సాహా, జానీ బెయిర్‌స్టో, శ్రీవాత్స గోస్వామి, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, నటరాజన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్, బాసిల్ తంపి, షాబాజ్ నదీమ్
Also Read: Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 32 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News