CSK vs SRH match highlights: రెచ్చిపోయిన గైక్వాడ్, డుప్లెసిస్.. సన్‌రైజర్స్‌పై చెన్నై విజయం

CSK vs SRH match highlights, IPL 2021: ఐపీఎల్‌ 2021లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SunRisers Hyderabad) ఐదుసార్లు ఓటమిపాలు కాగా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఐదో విజయంతో పాయింట్స్ పట్టికలో ముందంజలోకి దూసుకుపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2021, 06:15 AM IST
CSK vs SRH match highlights: రెచ్చిపోయిన గైక్వాడ్, డుప్లెసిస్.. సన్‌రైజర్స్‌పై చెన్నై విజయం

CSK vs SRH match highlights, IPL 2021: ఐపీఎల్‌ 2021లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SunRisers Hyderabad) ఐదుసార్లు ఓటమిపాలు కాగా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఐదో విజయంతో పాయింట్స్ పట్టికలో ముందంజలోకి దూసుకుపోయింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ధిష్ట 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్నాడనుకున్న బెయిర్ స్టో కేవలం 7 పరుగులకే పెవిలియన్ బాటపట్టగా.. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌ (David Warner 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీశ్‌ పాండే (46 బంతుల్లో 61; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకాలు నమోదు చేసుకున్నారు. అయితే మనీశ్ పాండేకు (Manish Pandey) అర్థ శతకం పూర్తి చేయడానికి కేవలం 35 బంతులే అవసరం కాగా.. వార్నర్ మాత్రం టెస్టు మ్యాచ్ తరహాలో ఆడుతూ హాఫ్ సెంచరీ కోసం 50 బంతులు తిన్నాడు. ఆఖర్లో బ్యాటింగ్‌కి వచ్చిన కేన్ విలియమ్సన్‌, కేదార్ జాదవ్‌ కాస్త దూకుడు పెంచడంతో సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

Also read : LRS Scheme: ఎల్ఆర్ఎస్ స్కీమ్ అమలుపై TS High court కీలక వ్యాఖ్యలు

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ ( Ruturaj Gaikwad 44 బంతుల్లో 75; 12 ఫోర్లు), డుప్లెసిస్‌ (Faf du Plessis 38 బంతుల్లో 56; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) రెచ్చిపోయారు. దీంతో పవర్‌ ప్లే ముగిసేటప్పటికే చెన్నై జట్టు 50/0 పూర్తి చేసుకుంది. గైక్వాడ్, డుప్లెసిస్ శుభారంభాన్ని ఇచ్చి జట్టును విజయతీరాలకు చేర్చగా.. జడేజా (7 నాటౌట్‌), సురేష్ రైనా (17 నాటౌట్‌) సునాయసంగానే మిగతా పని పూర్తిచేశారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి విజయం సొంతం చేసుకుంది. ఎంఎస్ ధోనీ (MS Dhoni) నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) విజయంలో కీలక పాత్ర పోషించిన రుతురాజ్ గైక్వాడ్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు కైవసం చేసుకున్నాడు.

Also read : COVID-19 నుంచి రికవరీ అయినవాళ్లు తీసుకోవాల్సిన Food, ఇతర జాగ్రత్తలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News