Ziva Dhoni: మా నాన్న జట్టే గెలవాలి.. క్యూట్‌గా ప్రార్థిస్తున్న ధోని కూమార్తె..ఫోటో వైరల్

IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తండ్రికి మద్దతు ఇచ్చేందుకు ధోనీ కూతురు జివా సోమవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియానికి వచ్చింది. తన తల్లితో కలిసి మ్యాచ్ ను తిలకించింది. అయితే తన తండ్రి జట్టు గెలవాలని జివా ప్రార్థిస్తున్న ఫోటో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2021, 12:28 PM IST
Ziva Dhoni: మా నాన్న జట్టే గెలవాలి.. క్యూట్‌గా ప్రార్థిస్తున్న ధోని కూమార్తె..ఫోటో వైరల్

IPL 2021: ఐపీఎల్‌ సెకండాఫ్ మ్యాచ్(IPL 2021) లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. నిన్న నెంబర్ వన్ స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో  చెన్నైపై ఢిల్లీ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ధోని కుమార్తె జివా(ZIVA DHONI) తన తండ్రి జట్టు గెలవాలని ప్రార్థిస్తున్న ఫోటో ఇప్పడు నెట్టింట వైరల్ గా మారింది. 

చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) నిర్ధేశించిన 137 పరుగుల తక్కువ లక్ష్యాన్ని చేధిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు 3 ఓవర్లలో 28 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో తన తల్లి సాక్షితో కలిసి దుబయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కూర్చున్న జివా...తండ్రి (MS Dhoni)కి అనుకూలంగా ఫలితం రావాలంటూ ప్రార్థిస్తున్నట్లు ఫొటోలో చూడొచ్చు. దీంతో జివా అమాయకత్వానికి క్రికెట్ అభిమానులను ఫిదా అవుతున్నారు. ఈ అందమైన ఫొటోను షేర్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు.

Also Read: DC vs CSK match highlights: ఉత్కంఠభరితమైన పోరులో చెన్నైపె గెలిచిన ఢిల్లీ.. IPL 2021 లో అగ్రస్థానం

చివరికి, షిమ్రాన్ హెట్మైర్ తుఫాన్ బ్యాటింగ్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచులో గెలిచి పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం అగ్రస్థానానికి చేరుకుంది. ధోని సేన రెండో స్థానంలో నిలిచింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఫృధ్వీషా, శిఖర్ ధావన్‌ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. ఫృధ్వీషా 18 పరుగులు చేసి ఔటైనా శిఖర్ ధావన్ నిలకడగా ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 39 పరుగులు (2 సిక్స్‌లు, 3 ఫోర్లు) చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే చివరలో చెన్నై బౌలర్లు చెలరేగిపోయారు. వరుసగా వికెట్లు సాధించారు. దీంతో ఢిల్లీ ఓడిపోతుందని అనుకున్నారు. కానీ క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెమ్మీర్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News