ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League 2020) ఈ సారి యూఏఈలో జరగనుంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు క్రికట్ అభిమానులు పండగ చేసుకోనున్నారు. కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించడం అరబ్ ప్రభుత్వానికి (IPL 2020 In UAE ) కత్తిమీద సాము లాంటిదే. ఆటగాళ్ల భద్రత కోసం ఐపీఎల్ నిర్వాహకులు, అక్కడి ప్రభుత్వం కలిసి తీసుకోనున్న చర్యలు ఇవే. ( Sachin Tendulkar: సెహ్వాగ్ కోసం సచిన్ త్యాగం )
క్వారెంటైన్ ప్రోటోకాల్ (Quarantine )
ప్రస్తుతం దుబాయ్ లో అమలులో ఉన్న హెల్త్ ప్రోటాకాల్ ప్రకారం ఒక వ్యక్తి వద్ద కోవిడ్ -19 నెగెటీవ్ ( Covid19 ) ఉన్న రిపోర్ట్ ఉంటే క్వారెంటైన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రిపోర్టు లేకపోతే మాత్రం తప్పకుండా అక్కడ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.
కోవిడ్-19 టెస్ట్ ( Covid-19 Test )
ఐపీఎల్ క్రీడాకారులు మొత్తం నాలుగు టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో రెండు భారత్ లో కాగా.. మరో రెండు కోవిడ్-19 పరీక్షలు యూఏఈలో చేస్తారు. క్రీడాకారులతో పాటు ఇతర సభ్యులకు కోవిడ్-19 పరీక్షలు తప్పనిసరి.
బయోబబుల్ ( BioBubble )
ప్రతీ ఫ్రాంచైజీ ఒక బయోబబుల్ ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కొంత మంది మధ్య మాత్రమే సంభాషణలు, సమావేశాలు ఉంటాయి. ఈ విషయంలో బీసీసీఐ సహాయం చేస్తుంది. ఆటగాళ్లను సురక్షితంగా ఉంచే విధానమే బయోబబుల్. ( Bio-bubble: బయోబబుల్ అంటే ఏంటి? ఆటగాళ్లు పూర్తిగా సురక్షితమా ? )
డీఎక్స్ బి యాప్ ( DXB App )
యూఏఈలో జరిగే ఐపీఎల్ 2020 ఆడబోయే ప్రతీ క్రీడాకారుడు తప్పనిసరిగా తన మొబైల్స్ లో డీఎక్స్ బి యాప్ ను వినియోగించాలి. అది మన దేశంలో ఉన్న ఆరోగ్య సేతు యాప్ లాంటిది.
గ్రౌండ్ లో ( Cricket Field )
క్రికెట్ మైదానంలో క్రీడాకారులు సోషల్ డిస్టెన్సింగ్ (Social Distancing) పాటించాల్సిందే. క్రీడాకారులు సెలబ్రేట్ చేసే సమయంలో ఇదివరకు ఉన్నట్టు కౌగిలించుకోవడం, హ్యండ్ షేక్స్ ఉండవు.
(Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు )
ప్రయాణం, వసతి..
ప్రతీ ఫ్రాంచైజీ తన ఆటగాళ్ల కోసం ప్రయాణం, వసతి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇందులో బీసీసీఐ, యూఏఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది.
డ్రెస్సింగ్ రూమ్ లో.. ( Dressing Room IPL 2020 )
డ్రెస్సింగ్ రూమ్ లో ఎక్కువలో ఎక్కువ 15 మంది మాత్రమే ఉండే అవకాశం ఇస్తారు. అంతకన్నా ఎక్కువ మందిని ఉండనివ్వరు.