Ryan Harris joins DC bowling coach: న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 (IPL-2020) టోర్నీ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు దుబాయ్‌లో జరగనుంది. కరోనా ( Coronavirus ) వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆరు నెలలపాటు ఇప్పటికే ఆలస్యమైంది. ఎలాగైనా 13వ సీజన్ టోర్నీ కప్‌ను సాధించాలన్న పట్టుదలతో ఇప్పటికే పలు జట్లు యూఏఈ చేరుకున్నాయి. ఈ టోర్నీ ఆరంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals) జట్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కొత్త బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్ రియాన్ హారీస్ ( Ryan Harris ) ను నియమిస్తున్నట్లు యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న 13వ ఐపీఎల్ సీజన్ నుంచి వచ్చే సీజన్ వరకు హారీస్ ఢిల్లీ జట్టుతో కలిసి ప్రయాణం చేస్తారని వెల్లడించింది. అయితే.. 2018, 2019 సీజన్లకు జట్టు బౌలింగ్ కోచ్‌గా ఉన్న జేమ్స్ హోప్స్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది జట్టుతో కలిసి ప్రయాణించలేడం లేదని ఫ్రాంఛైజీ వెల్లడించింది. Also read: Dope Tests: ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మలకు డోపింగ్ పరీక్షలు
📳 𝘈𝘭𝘦𝘳𝘵: 𝘈𝘥𝘥𝘪𝘵𝘪𝘰𝘯 𝘵𝘰 𝘤𝘰𝘢𝘤𝘩𝘪𝘯𝘨 𝘴𝘵𝘢𝘧𝘧 📳
Former Australian fast bowler and IPL winner @r_harris413 has joined us as our new Bowling Coach for the #Dream11IPL 💪🏻
More details: https://t.co/TnLEY3z5F4#WelcomeRyan #YehHaiNayiDilli pic.twitter.com/Q7zOypef2p
— Delhi Capitals (Tweeting from 🇦🇪) (@DelhiCapitals) August 25, 2020
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆలస్యంగా ప్రవేశించిన హారిస్ 113 టెస్ట్ వికెట్లు, 44 వన్డే వికెట్లు, 4 టీ 20 వికెట్లను సొంతం చేసుకున్నాడు. 2009లో హారిస్ డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడు. గాయాల కారణంగా ఆయన 2015లో పదవీ విరమణ ప్రకటించాడు. అప్పటినుంచి పలు జట్లకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. IPL 2020: అత్యంత ప్రమాదకర ఓపెనింగ్ జోడీ ఎవరంటే...
IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త బౌలింగ్ కోచ్