Deepti Sharma 3 wickets helps Pakistan scores 137 runs: మహిళల ఆసియాకప్ 2022లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసింది. దాంతో భారత్ ముందు 138 పరుగుల మోస్తరు లక్ష్యం ఉంది. భారత బౌలర్లు దీప్తి శర్మ 3, పూజా వస్త్రాకర్ 2 వికెట్లు పడగొట్టాడు. పాక్ బ్యాటర్ నిదా దార్ (56; 37 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ మారూఫ్ (32) కీలక ఇన్నింగ్స్ ఆడింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టుకు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు అమీన్ (11), మునీబా అలీ (17)తో పాటు ఒమైమా సోహైల్ (0) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో నిదా, మారూఫ్ జట్టును ఆదుకున్నారు. భారత బౌర్లపై పైచేయి సాధించి పరుగులు చేశారు. ఈ ఇద్దరి నిష్క్రమణ అనంతరం మిగతా బాటర్లు పెద్దగా ఆకట్టుకోలేదు.
Innings Break!
Target 🎯 for #TeamIndia - 1⃣3⃣8⃣
Over to our batters now. 👍👍
Scorecard ▶️ https://t.co/pWHNEjvpeh#AsiaCup2022 | #INDvPAK pic.twitter.com/whT0tJ1OVg
— BCCI Women (@BCCIWomen) October 7, 2022
మహిళల ఆసియాకప్ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా హర్మన్ సేన పటిష్టంగా ఉంది. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ భీకర ఫామ్‌లో ఉండగా.. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా స్థాయికి తగ్గట్టు రాణిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో దీప్తి శర్మ, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్ పత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
Also Read: వైరల్ వీడియో.. బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాను ఎంత ఈజీగా పట్టాడో చూడండి!
Also Read: మెగా మాస్ మానియా.. రెండో రోజు ఊపందుకున్న గాడ్ ఫాదర్..మొదటి రోజు కంటే ఎక్కువగా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook