Deepak Chahar Injured: దీపక్ చాహర్ కు గాయం.. ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు షాక్..!

Deepak Chahar Injured: టీ20 ప్రపంచకప్‌ ముందు టీమిండియాకు షాక్  తగలింది. ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు జడేజా, బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. తాజాగా మరో కీలక ప్లేయర్ కూడా గాయపడ్డాడు.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2022, 10:43 AM IST
Deepak Chahar Injured: దీపక్ చాహర్ కు గాయం.. ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు షాక్..!

Deepak Chahar Injured: టీ20 ప్రపంచకప్ కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు జడేజా, బుమ్రా గాయాలతో జట్టుకు దూరమయ్యారు. తాజాగా మరో కీలక ఆటగాడు దీపక్ చాహర్ (Deepak Chahar) సైతం గాయపడ్డాడు. సఫారీతో తొలి వన్డేకు ముందు ప్రాక్టీస్‌ సందర్భంగా అతడి చీలమండకు గాయమైనట్లు తెలుస్తోంది. ఆ కారణంగా అతడు మెుదటి మ్యాచ్ లో ఆడలేదు. గాయం కారణంగా చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్న చాహర్ ఇటీవల జట్టులోకి వచ్చాడు. వరల్డ్ కప్ కు స్టాండ్ బైగా అతన్ని ఎంపికచేసినప్పటికీ, అతడిని టీమ్  తో పాటు ఆస్ట్రేలియాకు పంపించలేదు. 

ప్రపంచకప్ లో టీమిండియా ప్రాక్టీస్‌ కోసమని ముకేశ్‌ చౌదరి,  చేతన్‌ సకారియాలను నెట్‌ బౌలర్లగా ఎంపిక చేశారు. వీరు టీంతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఇప్పటికే భారత జట్టు పెర్త్ కు చేరుకుంది. తొలి మ్యాచ్ లో దాయాది జట్టు పాకిస్థాన్ ను ఢీకొట్టనుంది. ఈ నెల 10, 13 తేదీల్లో వెస్టర్న్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో టీమిండియా ప్రాక్టీసు మ్యాచులు ఆడనుంది. అక్టోబరు 17 ఆసీస్ తో రోహిత్ సేన వార్మప్‌ మ్యాచ్‌ కూడా ఆడనుంది. వరల్డ్ కప్ కు స్టాండ్‌బై ఆటగాళ్లుగా శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, రవి బిష్ణోయ్‌లను ఎంపిక చేశారు. మరి గాయమైన దీపక్ ఈ మెగా టోర్నీకి అందుబాటులో ఉంటాడో లేదో వేచి చూడాలి. 

Also Read: ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేయడం చాలా కష్టం: వీవీఎస్ లక్ష్మణ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News