Kapil Dev Comments: టీమిండియా కీలక ఆటగాళ్లకు కపిల్‌ దేవ్‌ స్వీట్ వార్నింగ్..!

Kapil Dev Comments: ఈనెల 9 నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. కేఎల్ రాహుల్‌ కెప్టెన్సీలో భారత్‌ ఆడనుంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 6, 2022, 07:11 PM IST
  • 9 నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌
  • సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి
  • స్టార్‌ప్లేయర్‌పై కపిల్‌ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Kapil Dev Comments: టీమిండియా కీలక ఆటగాళ్లకు కపిల్‌ దేవ్‌ స్వీట్ వార్నింగ్..!

Kapil Dev Comments: ఈనెల 9 నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. కేఎల్ రాహుల్‌ కెప్టెన్సీలో భారత్‌ ఆడనుంది. ఈఏడాది చివరిలో టీ20 వరల్డ్ కప్‌ సైతం జరగనుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో టీమిండియా కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇది కాస్త ఆందోళన కల్గిస్తోంది. ఈక్రమంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

ఈసందర్భంగా టీమిండియా స్టార్‌ ఆటగాళ్ల తీరుపై స్పందించారు. వరల్డ్ కప్‌ లాంటి కీలక మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్‌ రాహుల్, శిఖర్‌ ధావన్ వంటి ఆటగాళ్లు ఒత్తిడికి గురి కాకుండదన్నారు. వీరంతా పెద్ద ఆటగాళ్లేనని..వారిపై భారీ అంచనాలు ఉన్నాయని కపిల్‌ దేవ్ చెప్పారు. ఆ అంచనాలతోనే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తున్నారని..అది వారికి సమస్య కాకూడదన్నారు. ఎలాంటి భయం లేకుండా ధాటిగా ఆడాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.  

కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కు 150 నుంచి 160 స్ట్రైక్‌ రేట్‌తో ఆడగల సామర్థ్యం ఉందని..ఐతే కీలక సమయాల్లో ఔట్ అవుతున్నారన్నారు. పరుగులు వేగంగా చేసే క్రమం పెవిలియన్ బాట పడుతున్నారని..ఆ సమస్యను అధికమించేందుకు మరికొన్ని బంతులు ఆడితే మంచిదన్నారు. కీలక ఆటగాళ్ల ఫామ్‌ బట్టే జట్టు విజయాలు ఆధార పడి ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వారి ఆట తీరులో మార్పు రావాలన్నారు.

నిలకడైన ఆట తీరుతో జట్టుకు విజయాలు అందించాలని ఆకాంక్షించారు. అలా కాకపోతే తప్పుకోవడం మంచిదన్నారు. పెద్ద ఆటగాళ్ల నుంచి మంచి ప్రదర్శన రావాలనుకుంటామని చెప్పారు. పేరుకే గొప్ప ఆటగాళ్లు ఐతే సరిపోదని..మంచి ప్రదర్శన కావాలని వ్యాఖ్యనిచ్చారు.

Also read: Bjp Leaders Tour: తెలంగాణపై ప్రధాని మోదీ ఫోకస్..రేపు పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు..!

Also read:TS CPGET-2022: తెలంగాణలో సీపీగెట్‌ దరఖాస్తుల స్వీకరణ షురూ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News