Men's Junior Asia Cup 2023: ఫైనల్లో పాక్ చిత్తు.. నాలుగోసారి ఆసియాకప్ విజేతగా భారత్..

Men's Junior Hockey Asia Cup 2023: పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్ ను భారత్ గెలుచుకుంది. ఫైనల్లో దాయాది పాకిస్థాన్ పై గెలుపొందింది. ఈ టైటిల్ తో అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 2, 2023, 09:10 AM IST
Men's Junior Asia Cup 2023: ఫైనల్లో పాక్ చిత్తు.. నాలుగోసారి ఆసియాకప్ విజేతగా భారత్..

Men's Junior Asia Cup 2023 final: భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు అరుదైన ఘనత సాధించింది. నాలుగోసారి జూనియర్ ఆసియా కప్ ను గెలిచిన టీమ్ గా రికార్డు సృష్టించింది. గురువారం జరిగిన ఫైనల్లో భారత్ 2-1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసింది. అంగద్ బీర్ సింగ్ (13వ నిమిషంలో) మరియు అరైజీత్ సింగ్ హుందాల్ (20 నిమిషంలో) గోల్‌లు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. మరోవైపు పాక్ తరుపున అలీ బషారత్ (38వ నిమిషంలో) గోల్ కొట్టాడు. భారత్ గోల్ కీపర్ శశికుమార్ మోహిత్ ఈ మ్యాచ్ లో అద్బుతమైన ప్రతిభ కనబరిచాడు. 

మన జట్టు గతంలో 2004, 2008 మరియు 2015లో టైటిల్‌ను గెలుచుకోగా... పాకిస్థాన్ 1988, 1992, 1996లో కప్ ను కైవసం చేసుకుంది. తాజాగా టైటిల్ గెలవడం ద్వారా భారత హాకీ జట్టు మలేషియాలో జరిగే పురుషుల జూనియర్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. అంతేకాకుండా హాకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. 

Also Read: Ruturaj Gaikwad Fiance: జూన్ 3న పెళ్లి.. రుతురాజ్‌ గైక్వాడ్‌కు కాబోయే భార్య ఎవరో తెలుసా?

"ఆసియా కప్‌లో భారత జూనియర్ పురుషుల జట్టు అద్భుత ప్రదర్శన మనందరినీ ఎంతో గర్వించేలా చేసింది. గత కొన్ని నెలలుగా మన జట్టు గొప్ప ప్రతిభ కనబరుస్తుంది. ఈ ఏడాది చివర్లో జరిగే జూనియర్ ప్రపంచ కప్‌లో భారత జట్టు మంచి ప్రదర్శన చేస్తుందని'' హాకీ ఇండియా ప్రెసిడెంట్ పద్మశ్రీ దిలీప్ టిర్కీ అన్నారు. 

Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్‌ జట్టులో ఉండాల్సిందే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News