India vs West Indies : టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్!

Rishabh Vice Captain: రేపటి నుంచి విండీస్‌తో జరగనున్నటువంటి టీ20 సిరీస్‌కు టీమిండియా వైఎస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 02:33 AM IST
  • ఫిబ్రవరి 16వ తేదీ నుంచి వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌
  • టీమిండియా వైఎస్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌
  • బీసీసీఐ నుంచి అధికారికంగా ప్రకటన
  • సిరీస్‌కు దూరం కానున్న వాషింగ్టన్‌ సుందర్‌
India vs West Indies : టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్!

IND vs WI T20I Series: ఫిబ్రవరి 16వ తేదీ నుంచి వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమిండియా వైఎస్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ వ్యవహరించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. 

అయితే టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. గాయం వల్ల ఆల్‌ రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. గాయంతో బాధపడుతున్నటువంటి  వాషింగ్టన్‌ సుందర్‌ ప్రాక్టీస్‌కు రాలేదు... వెస్టిండీస్‌తో జరగనున్న సిరీస్‌కు అతను పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉందంటూ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. 

ఇక వాషింగ్టన్‌ సుందర్‌ ప్లేస్‌లో జయంత్‌ యాదవ్‌ని టీమ్‌లోకి తీసుకున్నారు. అహ్మదాబాద్‌ నుండి కోల్‌కత్తా చేరిన టీమిండియా జట్టు ప్రాక్టీస్‌ చేస్తూ ఉంది. 

ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, అక్షర్ పటేల్‌ కూడా వెస్టిండీస్‌తో జరగనున్న సిరీస్‌కు దూరం అయ్యారు. దీంతో రుతురాజ్‌, దీపక్‌ హుడాలను టీమ్‌లోకి తీసుకున్నారు. కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ నెల 16, 18, 20వ తేదీల్లో టీ 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అలాగే విండీస్‌తో జరగనున్నటువంటి టీ20 సిరీస్‌లో పేసర్‌ అవేశ్, లెగ్ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ టీమిండియాలోకి అరంగేట్రం చేయనున్నారు.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ కోసం వేచి చూస్తున్న అరుదైన ప్రపంచ రికార్డు

Also Read: New NCA Building: బెంగళూరులో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి శంకుస్థాపన చేసిన గంగూలీ, జై షా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News