India vs West Indies 2nd ODI Playing 11: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో విండీస్ బరిలోకి దిగుతోంది. హేడెన్ వాల్ష్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ కూడా ఒక మార్పు చేసింది. తొలి వన్డేలో భారీగా పరుగులు ఇచ్చిన ప్రసిధ్ కృష్ణ స్థానంలో యువ పేసర్ అవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు.
మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగే రెండో వన్డే గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని విండీస్ చూస్తోంది. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. సొంతగడ్డపై ఇటీవలే బంగ్లాదేశ్‌కు సిరీస్ అప్పగించిన వెస్టిండీస్.. మరో సిరీస్ కోల్పోకూడదంటే ఈ మ్యాచులో తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఈ మైదానంలో టీమిండియా ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో ఏకంగా 9 గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
One change in the #TeamIndia Playing XI from the previous game.
Avesh Khan makes his debut and Prasidh Krishna sits out for the game.
Live - https://t.co/EbX5JUciYM #WIvIND pic.twitter.com/o3SGNrmQBd
— BCCI (@BCCI) July 24, 2022
తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్, అవేశ్ ఖాన్.
వెస్టిండీస్: షై హోప్, బ్రాండన్ కింగ్, షమ్రా బ్రూక్స్, కేల్ మయేర్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అకీల్ హోసీన్, రొమారియో షెఫెర్డ్, అల్జారీ జోసెఫ్, జయడెన్ సీలెస్, హేడెన్ వాల్ష్.
Also Read: PV Sindhu Bonalu 2022: అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన పీవీ సింధు!
Also Read: Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వెదర్ అలర్ట్..రాగల మూడు రోజులపాటు వానలే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.