ఇండియా vs విండీస్ 4వ వన్డే: ముంబై వన్డే మ్యాచ్‌ పూర్తి వివరాలు

ఇండియా vs విండీస్ 4వ వన్డే వివరాలు

Last Updated : Oct 29, 2018, 12:52 AM IST
ఇండియా vs విండీస్ 4వ వన్డే: ముంబై వన్డే మ్యాచ్‌ పూర్తి వివరాలు

రేపు సోమవారం ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో విండీస్‌తో జరగనున్న 4వ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ టీమిండియాకు కీలకం కానుంది. గౌహతిలో ఆడిన మొదటి వన్డే మ్యాచ్‌లో జట్టు గెలిచినప్పటికీ ఆ తర్వాత వైజాగ్ వన్డేలో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనంతరం పూణెలో ఆడిన 3వ వన్డేలో టీమిండియా 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కాస్తా 1-1తో సమమైంది. ఇక రేపు ఆడనున్న 4వ వన్డేలోనైనా టీమిండియా గెలిస్తేనే.. విండీస్ జట్టుపై 2-1 ఆధిక్యత సాధించే వీలు కలుగుతుంది. లేదంటే చివరి వన్డేపై తీవ్రమైన ఒత్తిడి ఉండటం ఖాయం అని క్రికెట్ ప్రియులు భావిస్తున్నారు.

రేపటి 4వ వన్డేలో ఆడనున్న టీమిండియా ఆటగాళ్ల జాబితా:
విరాట్ కోహ్లీ (కెప్టేన్), రోహిత్ శర్మ (వైస్-కెప్టేన్), శిఖర్ ధవన్, అంబటి రాయుడు, రిశబ్ పంత్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మెద్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే.

మ్యాచ్ వేదిక:
ముంబైలోని బ్రాబోర్న్ క్రికెట్ స్టేడియం.

తేదీ, సమయం:
అక్టోబర్ 29, సోమవారం, మధ్యాహ్నం 1:30 గంటలకు. 

ఏ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది:
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్ ఈ వన్డే మ్యాచ్‌ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 

మ్యాచ్ ప్రారంభమైన అనంతరం లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ కింది లింకును క్లిక్ చేయండి.
https://www.cricketcountry.com/series/west-indies-in-india-2018-200975/live-scores/india-vs-west-indies-4th-odi-match-187762-summary.html

Trending News