నాగ్ పూర్ : విదర్భ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీసేన శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆది నుంచి తడబడుతూ ఆడింది. చివరకు భారత్ స్పిన్ ధ్వయం అశ్విన్, జడేలా ధాటికి చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో అశ్విన్ 4 వికెట్లు తీయగా.. జడేజా 3 వికెట్లు తీశాడు. అలాగే వెటరన్ ఫేసర్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా 205 స్కోరుకే శ్రీలంక ఆలౌటైంది.
ఇక బ్యాట్స్మెన్ల వంతు..
బౌలర్లు తమ వంతు పని పూర్తి చేశారు...ఇప్పుడు బ్యాట్స్మెన్ల వంతు వచ్చింది. తొలి ఇన్నింగ్ లో భారీ స్కోర్ చేస్తే శ్రీలంకను ఒత్తిడిలో పడేయవచ్చు. ఇదే వ్యూహంతో కోహ్లీ సేన బ్యాటింగ్ ఆరంభించింది. పటిష్ఠ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ కు లంకపై భారీ స్కోర్ చేయడం పెద్దకష్టం కాకపోవచ్చు. అయితే శ్రీలంక బౌలింగ్ ను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే తొలి టెస్టులో భారత బ్యాట్స్ మెన్లును ఏ స్థాయిలో కట్టడి చేశారో మనం చూశాం..కాబట్టి టీమిండియా సమిష్ఠిగా రాణిస్తేనే భారీ స్కోరు రాబట్టవచ్చు.