India vs South Africa: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రీకా టీ20 సిరీస్ రంగం సిద్ధం, టీమ్ ఇండియాపై సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

India vs South Africa: ఐపీఎల్ 2022 ముగిసింది. మరో పదిరోజుల్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా టీ20 రధ సారధి..టీమ్ ఇండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 31, 2022, 07:45 PM IST
India vs South Africa: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రీకా టీ20 సిరీస్ రంగం సిద్ధం, టీమ్ ఇండియాపై సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

India vs South Africa: ఐపీఎల్ 2022 ముగిసింది. మరో పదిరోజుల్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా టీ20 రధ సారధి..టీమ్ ఇండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రసవత్తరంగా సాగిన ఐపీఎల్ 2022 టీ20 సిరీస్ ముగిసింది. మరి కొద్దిరోజుల్లో టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. జూన్ 9 నుంచి ఇండియాలో దక్షిణాఫ్రికా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈసారి టీ20 సిరీస్‌కు టీమ్ ఇండియా సీనియర్లకు విశ్రాంతినిచ్చింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలో టీ20 సిరీస్‌కు సిద్ధమౌతోంది. అటు దక్షణాఫ్రికా టీ20 టీమ్‌కు సారధ్యం వహిస్తున్న తెంబా బవుమా..టీమ్ ఇండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీమ్ ఇండియాను తక్కువగా అంచనా వేయలేమని తెంబా బవుమా అభిప్రాయపడ్డాడు. టీమ్ ఇండియా ఆటగాళ్లంతా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని..అయినా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చేంత లగ్జరీ తమకు లేదని..ఇండియాలో ఆటగాళ్లు మాత్రం అందరూ ఫామ్‌లో ఉన్నారని చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌కు..ఇండియా పర్యటన దోహదపడుతుందన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఆతిధ్యమిస్తున్న ఆస్ట్రేలియా పరిస్థితులు ఇండియాలో లేకపోయినా..టీమ్ ఇండియా వంటి బలమైన జట్టుతో సిరీస్ చాలా అవసరమన్నాడు. 

18 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టుకుని ప్రకటించిన బీసీసీఐ..కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బూమ్రా, మొహమ్మద్ షమీలకు విశ్రాంతి ఇచ్చింది. టీమ్ ఇండియా రధ సారధిగా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ వ్యవహరిస్తుండగా..ఐపీఎల్ 2022లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రుతురాత్ గైక్వాడ్, దీపక్ హుడా, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్, అవేశ్ ఖాన్, అర్ధదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లతో జట్టు సిద్ధమైంది. 

Also read: Umran malik: ఉమ్రాన్ మాలిక్‌కు నేను పెద్ద అభిమానిని, ఏదో ఓ రోజు పాకిస్తాన్ బౌలర్‌లా మారుతాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News