జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్ మాత్రం 2 మ్యాచ్‌ల విజయంతో ఆధిక్యంలో వున్న సౌతాఫ్రికాకే దక్కింది. లంచ్ బ్రేక్ తర్వాత టీమిండియా బౌలర్లు రెచ్చిపోవడంతో సిరీస్‌లో సౌతాఫ్రికా దండయాత్రకు బ్రేక్ పడింది. బౌలర్లు మహ్మద్ షమి 5, బుమ్రా 2, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీసి టీమిండియాకు ఘన విజయం అందించడమే కాకుండా సౌతాఫ్రికా అప్రతిహత విజయాలకు అడ్డుకట్టవేశారు.
నాలుగో రోజైన శనివారం నాడు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు లంచ్ బ్రేక్‌కి ముందు కాస్త నిలకడగానే కనిపించినప్పటికీ.. ఆ తర్వాతే వరుస పెట్టి వికెట్లు సమర్పించుకుంది. శుక్రవారం మ్యాచ్ ముగిసే సమయానికి క్రీజులో వున్న ఎల్గర్, ఆమ్లాలు శనివారం మ్యాచ్ ప్రారంభమయ్యాకా భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే, సౌతాఫ్రికా జట్టు నిలకడగా ఆడుతుందనుకుంటున్న తరుణంలోనే ఇశాంత్ బౌలింగ్‌లో ఆ ఇద్దరి భాగస్వామ్యానికి ఆమ్లా వికెట్ రూపంలో బ్రేక్ పడింది. అనంతరం డుప్లెసిస్(2), డివిలియర్స్(6), డికాక్(0) వరుసగా పెవిలియన్ బాటపట్టారు.
68వ ఓవర్‌లో షమీ వేసిన మూడో బంతికి ఫిలాందర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్ చవరి బంతికి పెహ్లుక్‌వాయో డకౌట్ అయ్యాడు. దీంతో సౌతాఫ్రికా టాప్, మిడిల్ ఆర్డప్ కుప్పకూలినట్టయింది. పెహ్లుక్‌వాయో తర్వాత క్రీజులోకి వచ్చిన రబాడా(1) భువనేశ్వర్ విసిరిన బంతిని షాట్ కొట్టబోయి స్పిప్స్‌లో కాచుకు కూర్చున్న పుజారా చేతికి చిక్కి క్యాచ్ ఔట్ అయ్యాడు.
రబాడా తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మోర్కెల్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ఒక్క పరుగు కూడా చేయకుండానే షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన మోర్కెల్ సున్నా స్కోర్‌తో పెవిలియన్ చేరాడు. దీంతో 70 ఓవర్లు ముగిసే సమయానికి సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత డీన్ ఎల్గర్ చేసిన ప్రయత్నాలు కూడా వృధా అవడంతో సౌతాఫ్రికా 177 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా విజయంలో 5 వికెట్లు తీసిన షమీ కీలక పాత్ర పోషించగా సఫారీల విజయం కోసం కృషిచేసిన డీన్ ఎల్గర్ (86 నాటౌట్: 240 బంతుల్లో 9×4, 1×6) శ్రమకు మాత్రం ఫలితం లేకపోయింది.
సౌతాఫ్రికాపై సిరీస్ ఓడిన టీమిండియా