/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

Ind vs NZ: 2nd T20 preview: ఇండియా-న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్​లో తొలి మ్యాచ్​లో విజయం సాధించి ఫుల్​ జోష్​లో ఉంది టీమ్ ఇండియా. రెండో మ్యాచ్​నూ గెలిచి.. సిరీస్​ను (India vs NZ 2nd T20) కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

మరోవైపు కివీస్​ జట్టు.. కూడా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్​ కావడంతో విజయం కోసం వీలైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వరల్డ్​కప్​ ఫైనల్స్​లో పరాబావం ఎదుర్కొన్న న్యూజిలాండ్​ జట్టు.. భారత్​తో తొలి మ్యాచ్​లోనూ ఓటమి పాలైంది. దీనితో రెండో మ్యాచ్​లో గెలిచి తీరాలని కసితో ఉంది కివీస్ టీమ్​.

టీమ్ ఇండియా బలాలు, బలహీనతలు..

రోహీత్ శర్మ కెప్టెన్​గా(Rohit Sharma), రాహుల్ ద్రవిడ్ జట్టు కోచ్​గా  (Rahul Dravid) నియమితులైన తర్వాత జరిగిన తొలి మ్యాచ్​లో టీమ్ ఇండియా (Team India) విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్​లో పలు లోపాలు బయటపడ్డాయి.

Also read: మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌.. డేవిడ్ వార్నర్​కే ఎందుకిచ్చారంటే?

ముఖ్యంగా బౌలిలంగ్​లో వైఫల్యం కనిపించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకు ముందు మ్యాచ్​ను పరిశీలిస్తే.. కివీస్ జట్టు 13 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. ఆ సమయంలో స్కోరు 106గా ఉంది. వికెట్లు పడకపోవడం, స్కోరు భారీగా పెరుగుతుండటం వంటివి కాస్త ఆందోళన కలిగించాయి. ఎట్టకేలకు రవిచంద్రన్ అశ్విన్ చాప్​మన్, పిలిప్స్​లను ఔట్ చేశాక కివీస్ జట్టును కాస్త అదుపు చేయగలిగింది టీమ్ ఇండియా.

బౌలింగ్​లో అశ్విన్​, భువనేశ్వర్ తప్ప.. సిరాజ్, దీపక్ చాహర్​, అక్షర్ పటేల్​ అంతగా రాణించలేకపోయారు. గాయం కారణంగా సిరాజ్ స్థానంలో నేటి మ్యాచ్​లో మరొకరికి స్థానం దక్కే అవకాశముంది. అయితే పరుగుల విషయంలో కివీస్​ను కట్టడి చేసేందుకు బౌలర్లు కృషి చేయాలని చెబుతున్నారు విశ్లేషకులు.

బ్యాంటింగ్ పరంగా చూస్తే.. మిడిలార్డర్‌ బ్యాటర్లు జట్టుకు చేయుతనివ్వాల్సిన అవసరం ఉంది. చివరి మ్యాచ్​లో నాలుగో స్థానంలో దిగిన శ్రేయాస్ అయ్యర్​ తడబడ్డాడు. రిషబ్​ పంత్ కాస్త పర్వాలేదని పించినా.. వెంకటేశ్ అయ్యర్​ రెండు బంతులకే ఔటవ్వడం ఆందోళన కలిగించింది. అందుకే ఈ మ్యాచ్​లో వారికి అవకాశమిస్తే.. మెరుగైన ప్రదర్శన కనబర్చాలని అంటున్నారు విశ్లేషకులు.

Also read: న్యూజిలాండ్ తో మ్యాచ్ గెలవడం అంత తేలిక కాదని తెలిసింది: రోహిత్ శర్మ

కివీస్​కు కీలక మ్యాచ్​..

కివీస్​కు సిరిస్​పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్​లో తప్పక గెలవాలి. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ పరంగా మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్ టీమ్​ (NZ team).. బౌలింగ్​పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. చివరి మ్యాచ్​లో పవర్​ ప్లేలో టీమ్ ఇండియా ప్లేయర్స్​ను కట్టడి చేయడంలో విఫలమైనందున.. ఈ సారి ఆ లోపాలను సరిచేసుకుంటూ ముందుగా సాగాలని భావిస్తోంది.

ఒకవేళ నేటి మ్యాచ్​లోను కివీస్ జట్టు ఓడిపోతే సిరీస్  భారత్ కైవసం అవుతుంది. దీనితో ఈ నెల 21న జరిగే చివరి టీ20 మ్యాచ్ నామమాత్రం కానుంది. నేడు సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఝార్ఖండ్ లోని రాంచీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

Also read: ఇండియా, న్యూజిలాండ్ టీ20 మ్యాచును వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిల్

Also read: మహ్మద్ సిరాజ్ పై చేయి చేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
India vs New Zealand: India Gear Up For Series Win, Better Middle-Order Show
News Source: 
Home Title: 

సిరీస్ గెలిచే లక్ష్యంతో ఇండియా.. ఆశలు సజీవం చేసుకునేందుకు కివీస్​!

సిరీస్ గెలిచే  లక్ష్యంతో ఇండియా.. ఆశలు సజీవం చేసుకునేందుకు కివీస్​!
Caption: 
Representative image (File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

న్యూజిలాండ్​తో టీమ్ ఇండియాకు నేడు రెండో టీ20 మ్యాచ్​

సిరీస్​ కైవసం చేసుకునేందుకు టీమ్ ఇండియా కసరత్తు

తప్పక గెలవాల్సిన మ్యాచ్​పై కివీస్ ప్రత్యేక దృష్టి

Mobile Title: 
సిరీస్ గెలిచే లక్ష్యంతో ఇండియా.. ఆశలు సజీవం చేసుకునేందుకు కివీస్​!
ZH Telugu Desk
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, November 19, 2021 - 06:39
Request Count: 
57
Is Breaking News: 
No