Rohit Sharma: బంతిని ఆపబోయి కిందపడ్డ రోహిత్ శర్మ.. ఇదేం ఔట్‌ఫీల్డ్‌ రా అంటూ అసహనం

India Vs New Zealand Highlights: ధర్మశాల ఔట్‌ఫీల్డ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని ఆపబోయి ఔట్‌ఫీల్డ్ కారణంగా కిందపడ్డాడు. దీంతో రెండు ఓవర్లపాటు అసహనం వ్యక్తం చేశాడు.   

Written by - Ashok Krindinti | Last Updated : Oct 23, 2023, 06:22 AM IST
Rohit Sharma: బంతిని ఆపబోయి కిందపడ్డ రోహిత్ శర్మ.. ఇదేం ఔట్‌ఫీల్డ్‌ రా అంటూ అసహనం

India Vs New Zealand Highlights: ప్రపంచకప్‌లో టీమిండియా మరోసారి అదరగొట్టింది. పటిష్ట న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో భారత్ టేబుల్ టాప్‌ ప్లేస్‌కు చేరుకోగా.. కివీస్‌ రెండో స్థానానికి పడిపోయింది. మహ్మద్ షమీ ఐదు వికెట్ల ప్రదర్శనకు.. విరాట్ కోహ్లీ (95) పరాక్రమం తోడవడంతో న్యూజిలాండ్‌పై టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులు చేయగా.. భారత్ ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌ ఫీల్డింగ్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ తృటిలో గాయం నుంచి తప్పించుకున్నాడు. అందుకు కారణం ధర్మశాల ఔట్‌ఫీల్డ్. 

న్యూజిలాండ్ బ్యాటింగ్ సందర్భంగా 10వ ఓవర్‌లో మిడ్-ఆఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ.. బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే ఔట్ ఫీల్డ్ కారణంగా జారి కిందపడ్డాడు. దీంతో చేతి వేళ్లు నేలకు బలంగా తాకడంతో ఇబ్బంది పడ్డాడు. ఔట్‌ఫీల్డ్‌ను చూసి కోపం వ్యక్తం చేశాడు. ఇదేం ఔట్‌ఫీల్డ్ రా అన్నట్లు లుక్ ఇచ్చాడు. వెంటనే ట్రీట్‌మెంట్‌ కోసం మైదానాన్ని వీడాడు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ నాయకత్వం వహించాడు. రెండు ఓవర్ల అనంతరం హిట్‌మ్యాన్ తిరిగి గ్రౌండ్‌లోకి వచ్చాడు.  

 

ధర్మశాల ఔట్‌ఫీల్డ్‌పై వరుసగా విమర్శలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉల్ హక్ కూడా ఔట్‌ఫీల్డ్ కారణంగా కిందపడి గాయపడ్డాడు. ఆ జట్టు ప్రధాన కోచ్ జోనాథన్ ట్రాట్ ఈ విషయంపై మాట్లాడారు. గాయాల భయం లేకుండా ఆటగాళ్లు తమ ఫీల్డింగ్‌ను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే తమ జట్టు ఓటమికి ఔట్ ఫీల్డ్ పరిస్థితులు కూడా ఓ కారణమని అన్నారు. ఈ వివాదం తర్వాత ఐసీసీ స్వతంత్ర పిచ్ కన్సల్టెంట్ ఆండీ అట్కిన్సన్ ధర్మశాల అవుట్‌ఫీల్డ్‌ను యావరేజ్‌గా ఉన్నట్లు అంచనా వేశారు. 

అయితే ఇప్పటికీ మ్యాచ్‌లకు అనుకూలంగా ఉందని చెప్పారు. ఐసీసీ పిచ్, ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్ కింద పిచ్, ఔట్‌ఫీల్డ్ పరిస్థితులను అంచనా వేసే బాధ్యత మ్యాచ్ అధికారులపై ఉంటుందని ఐసీసీ తెలిపింది. తరువాతి మ్యాచ్‌లకు ఔట్‌ఫీల్డ్‌పై రిఫరీ జవగల్ శ్రీనాథ్ సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ.. మళ్లీ టీమిండియా-న్యూజిలాండ్ మ్యాచ్‌ సందర్భంగా అదే పరిస్థితి ఉన్నట్లు అర్థమవుతోంది. రోహిత్ శర్మ గాయం భయం తర్వాత మరింత చర్చనీయాంశమైంది. 

Also Read: Karampudi Man Death News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. భార్య బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రికే భర్త మృతదేహం

Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News