Jasprit Bumrah as Team India Test Captain: ఇంగ్లాండ్-ఇండియా మధ్య జూలై 1న జరగనున్న సింగిల్ టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారినపడటంతో అతను మ్యాచ్ ఆడేది లేనిది అనుమానంగా మారింది. మ్యాచ్‌కు మరో 3 రోజులే గడువు ఉండగా ఇప్పటికైతే బీసీసీఐ నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. ఒకవేళ రోహిత్ మ్యాచ్‌కు దూరమయ్యే పక్షంలో కెప్టెన్‌గా ఎవరికి పగ్గాలు అప్పగిస్తారనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ పేర్లు తెరపైకి రాగా.. తాజాగా జస్ప్రిత్ బుమ్రా పేరు కూడా ఆ వరుసలో వినిపిస్తోంది.
ఈ ఏడాది సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ తప్పుకోవడంతో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరించారు. ఇంగ్లాండుతో జరగబోయే టెస్టులో రాహుల్ ఆడాల్సి ఉన్నా గాయం కారణంగా దూరమయ్యాడు. ఇదే సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌లో గతేడాది జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఒకవేళ రాహుల్ ఇంగ్లాండుతో ఐదో టెస్టుకు అందుబాటులో ఉండి ఉంటే అతనే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉండేది.
ప్రస్తుతం రాహుల్ జట్టుకు దూరమవడం, రోహిత్ ఆడేది లేనిది అనుమానంగా మారడంతో బుమ్రాను కెప్టెన్‌గా నియమించే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే 1987 తర్వాత టీమిండియా జట్టుకు టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి పేసర్‌గా బుమ్రా రికార్డుల్లోకి ఎక్కుతాడు. 1987లో కపిల్ దేవ్ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత మళ్లీ ఏ పేసర్‌కు ఆ అవకాశం దక్కలేదు. ఈసారి బుమ్రాకు ఆ అవకాశం చిక్కితే అరుదైన ఛాన్స్ కొట్టేసినట్లే.
రోహిత్ పరిస్థితేంటి.. బీసీసీఐ ఏం ఆలోచిస్తుంది..
రోహిత్ ప్రస్తుతం క్వారెంటైన్లో ఉన్నాడు. మ్యాచ్ నాటికి అతను కోలుకుంటాడని బీసీసీఐ నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్ ప్రోటోకాల్ సంగతేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంగ్లాండ్ అనుసరిస్తున్న ప్రోటోకాల్ ప్రకారం ఐదు రోజుల క్వారెంటైన్ ఉండొచ్చునని చెబుతున్నారు. అదే సమయంలో.. కోవిడ్ నెగటివ్‌గా తేలినవారికి తప్పనిసరి క్వారెంటైన్ నిబంధనలేమీ లేవనే వాదన కూడా వినిపిస్తోంది. ఇవాళ ఐర్లాండుతో ఇండియా టీ20 మ్యాచ్ ముగిశాక బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ యూకె వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చేతన్ శర్మ ఇచ్చే రిపోర్టు పైనే రోహిత్ ఆడేది లేనిది బీసీసీఐ డిసైడ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
Also Read: Horoscope Today June 28th: నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.