IND vs ENG 4th Test: Rishabh Pant అద్భుత శతకం, వాషింగ్టన్ సుందర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ఆధిక్యం

India vs England 4th Test Day 2 Highlights: తొలుత బౌలింగ్‌లో పర్యాటక ఇంగ్లాండ్ జట్టును 205 పరుగులకే పరిమితం చేయగా, ఆపై బ్యాటింగ్‌లో ప్రస్తుతానికి 89 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 5, 2021, 07:23 PM IST
  • ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులోనూ టీమిండియా ఆధిపత్యం
  • ప్రస్తుతానికి 89 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది
  • రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు
IND vs ENG 4th Test: Rishabh Pant అద్భుత శతకం, వాషింగ్టన్ సుందర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ఆధిక్యం

India vs England 4th Test Day 2 Highlights: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక చివరి టెస్టులోనూ టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలుత బౌలింగ్‌లో పర్యాటక ఇంగ్లాండ్ జట్టును 205 పరుగులకే పరిమితం చేయగా, ఆపై బ్యాటింగ్‌లో ప్రస్తుతానికి 89 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.

శతక్కొట్టిన రిషబ్ పంత్
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(49) మరోసారి ఫామ్ కొనసాగించాడు. బాధ్యతాయుత ఇన్నింగ్స్ తరువాత ఔటయ్యాడు. ఆఫై వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ చెలరేగడంతో భారత్ స్కోరు పరుగులు పెట్టింది. గత కొన్ని ఇన్నింగ్స్‌లలో 90లలో ఔట్ అయిన టీమిండియా(Team India
) వికెట్ కీపర్ పంత్ ఈ మ్యాచ్‌లో పట్టుదలతో ఇంగ్లాండ్ స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొన్నాడు. సిక్సర్ ద్వారా అద్భుతమైన శతకం సాధించాడు పంత్. కానీ శతకం పూర్తయిన వెంటనే అండర్సన్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌కు క్యాచిచ్చి పంత్(101: 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. దీంతో 7వ వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

Also Read: Rohit Sharma: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత, కెప్టెన్ Virat Kohli వరుస వైఫల్యాలు

పంత్ ఔటయ్యాక వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగించారు. వాషింగ్టన్ సుందర్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 117 బంతుల్లో 8 ఫోర్లు బాదాడు. మరో ఎండ్‌లో అక్షర్ పటేల్ ఆధిక్యాన్ని పెంచేందుకు ఏ తడబాటు లేకుండా స్ట్రైక్ రొటేట్ చేశారు. 34 బంతుల్లో 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే మూడోరోజు ఆటలో ఎంత స్కోరు చేస్తారనే దాంతో పాటు ఇంగ్లాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకు పరిమితం చేస్తే భారత విజయం నల్లేరుపై నడకే.

Also Read: MS Dhoni: మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డుకు ఎసరు పెట్టిన Virat Kohli, అడుగు దూరంలో

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 24/1తో ఆట ప్రారంభించిన టీమిండియా తొలి రెండు సెషన్లలో పరుగులు సాధిస్తున్న వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. అయితే పుజారా(17), విరాట్ కోహ్లీ డకౌట్ కావడంతో రోహిత్ శర్మ జట్టును నడిపించాడు. అజింక్య రహానే నిలదొక్కుకున్నట్లు కనిపించినా 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అండర్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆపై నిలకడగా ఆడిన రోహిత్ శర్మ(49) జట్టును నడిపించినా హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టాడు. 

Also Read: HBL PSL 6 postponed: కరోనా కారణంగా వాయిదా పడిన PSL 2021

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News