Ind vs Eng 3rd test day 1: ఇండియా vs ఇంగ్లాండ్ 3వ టెస్ట్ మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్

India vs England 3rd Test Day 1 live score updates: లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జోష్ మీదున్న భారత జట్టు అదే ఊపుతో లీడ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మూడో టెస్ట్ మ్యాచ్‌లోనూ విజయం కైవసం చేసుకుని సిరీస్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు మార్క్‌వుడ్ ఈ మూడవ టెస్ట్ మ్యాచ్‌కి (IND vs ENG third test match) దూరమవడంతో ఇంగ్లాండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2021, 03:58 PM IST
Ind vs Eng 3rd test day 1: ఇండియా vs ఇంగ్లాండ్ 3వ టెస్ట్ మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్

India vs England 3rd Test Day 1 live score updates: ఇండియా vs ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జోష్ మీదున్న భారత జట్టు అదే ఊపుతో లీడ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మూడో టెస్ట్ మ్యాచ్‌లోనూ విజయం కైవసం చేసుకుని సిరీస్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. కొత్తగా గాయాల బారినపడిన ఆటగాళ్ల జాబితాలో మార్క్‌వుడ్ (Mark wood injured) పేరు కూడా వచ్చి చేరింది. మార్క్‌వుడ్ ఈ మూడవ టెస్ట్ మ్యాచ్‌కి (IND vs ENG third test match) దూరమవడంతో ఇంగ్లాండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలినట్టయింది. 

Team England against India in third test match - ఇంగ్లాండ్ ఆటగాళ్ల జాబితా: 
విరాట్ కోహ్లి, 
రోహిత్ శర్మ,
కెఎల్ రాహుల్,
చటేశ్వర్ పుజారా,
అజింక్య రహానె,
రిషబ్ పంత్,
రవింద్ర జడేజా,
జస్ప్రిత్ బుమ్రా,
మహమ్మద్ షమి,
ఇషాంత్ శర్మ,
మొహ్మద్ సిరాజ్.

Also read : Ind Vs Eng : రెట్టించిన ఉత్సాహంతో భారత్..పలు మార్పులతో ఇంగ్లాండ్..లీడ్స్ వేదికగా పోరు

Team India against England in third test match - ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ల జాబితా:
రోరి బర్న్స్,
హసీబ్ హమీద్,
డేవిడ్ మలన్,
జోయ్ రూట్,
జానీ బెయిర్‌స్టో
జాస్ బట్లర్,
మొయీన్ అలీ,
శామ్ కుర్రన్,
క్రెయిగ్ ఓవర్టన్,
ఓలి రాబిన్సన్,
జిమ్మీ ఆండర్సన్.

లార్డ్స్ మైదానంలో విజయం సొంతం చేసుకున్నట్టే విరాట్ కోహ్లీ అండ్ కో (Virat Kohli) అదే జోష్ థర్డ్ టెస్ట్ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తుందా లేదా అని టీమిండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also read : Hardik Pandya: హార్ధిక్ పాండ్యా 'వాచ్' రేటు ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాంక్ అయిపోద్ది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News