Dharmashala Test: పాటిదార్‌పై వేటు.. టెస్టుల్లో ఆ యంగ్ క్రికెటర్ డెబ్యూ ఖరారు!

Dharmashala Test: ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టుకు ముందు టీమిండియాలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వరుసగా విఫలమవుతున్న రజిత్ పాటిదార్ పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

Written by - Samala Srinivas | Last Updated : Feb 29, 2024, 02:44 PM IST
Dharmashala Test: పాటిదార్‌పై వేటు.. టెస్టుల్లో ఆ యంగ్ క్రికెటర్ డెబ్యూ ఖరారు!

India vs England 05th Test Updates: స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా నామమాత్రమైన చివరి టెస్టుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ప్రయోగాలకు సిద్ధమవుతోంది టీమిండియా. ఈ సిరీస్ లో ఆఖరిదైన ఐదో టెస్టు ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది. ఐదో టెస్టులో ఆడతాడనుకున్న కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడు ట్రీట్మెంట్ కోసం లండన్ కు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు వరుసగా విఫలమవుతూ వస్తున్న ర‌జ‌త్ పాటిదార్ పై వేటు పడే అవకాశం ఉంది. అతడి స్థానంలో యువ క్రికెటర్ దేవ్‌ద‌త్ ప‌డిక్కల్‌ (Devdutt Padikkal) ఆరంగ్రేటం చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జ‌రిగితే ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన నాలుగో భార‌త క్రికెటర్ గా ప‌డిక్క‌ల్ రికార్డు సృష్టిస్తాడు. 

ఇప్పటికే ఈ సిరీస్ లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్, ర‌జ‌త్ పాటిదార్‌, ధ్రువ్ జురెల్‌లు డెబ్యూ క్యాప్ అందుకున్నారు. కోహ్లీ స్థానంలో వచ్చిన రజిత్ పాటిదార్ కు వరుసగా ఛాన్స్ లు ఇచ్చినా విఫలమవుతూ వస్తున్నాడు. ఇతడు ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 64 పరుగులు మాత్రమే చేశాడు. అతడు నిరాశపరుస్తుండటంతో రజిత్ ప్లేస్ లో పడిక్కల్ ను ఆడించాలనే డిమాండ్ ఎక్కువైంది. గ‌త కొంత కాలంగా ప‌డిక్క‌ల్ దేశ‌వాళీ క్రికెట్, ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో ఇతడు దిట్ట అనే చెప్పాలి. ధర్మశాలలో ఇతడు డెబ్యూ క్యాప్ అందుకోవడం పక్కా అనిపిస్తోంది. మరోవైపు నాలుగో టెస్టుకు రెస్ట్ ఇచ్చిన స్టార్ పేసర్ బుమ్రా.. ఐదో టెస్టుకు తిరిగి రానున్నాడు 

Also Read: WPL 2024: మ్యాచ్‌ మధ్యలో ఆర్సీబీ ప్లేయర్ కు మ్యారేజ్ ప్రపోజల్... వైరల్ అవుతున్న ఫోటో..

Also Read: BCCI Central Contracts: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషాన్‌లకు భారీ షాక్.. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు.. ఆ నలుగురికి A+ గ్రేడ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News