India vs Bangladesh 3rd T20I: బంగ్లాదేశ్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ టీ20 సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేసేసి దసరా ఆనందాన్ని రెట్టింపు చేసింది. మరోసారి ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారిన చోట.. ప్రత్యర్థి బంగ్లా కుర్రాళ్లు ఏమాత్రం పోరాడలేక చేతులెత్తేశారు. ఫలితంగా 133 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా భారత అభిమానులు, క్రికెట్‌ప్రియులు నిజంగంటే పండుగ చేసుకున్నారు. టెస్ట్ సిరీస్‌తోపాటు టీ20 సిరీస్‌ను చేజార్చుకుని నిరాశతో బంగ్లా ఆటగాళ్లు స్వదేశం తిరుగు ప్రయాణమయ్యారు.
Also Read: IND vs BAN T20: విరాట్ జోలికి వెళ్లకుండా..రోహిత్ రికార్డును బద్దలుకొట్టిన సూర్యకుమార్ యాదవ్
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ తలపడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి పరుగుల వరద పారించింది. సిక్సర్ల మోతతో ఉప్పల్ స్టేడియం మార్మోగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందుంచింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు తేలిపోయారు. 7 వికెట్ల నష్టంతో 164 పరుగులు మాత్రమే చేసి బంగ్లాదేశ్ పరాజయం అంచున నిలిచింది. వరుసగా మూడు టీ20 మ్యాచ్‌లను నెగ్గి భారత్ చారిత్రక విజయాన్నందుకుంది.
Also Read: IND vs BAN: ఉప్పల్ స్టేడియంలో దంచికొట్టిన శాంసన్..బంగ్లాపై టీమిండియా ప్రపంచ రికార్డ్ మిస్
బ్యాటింగ్‌కు దిగిన భారత్ చెలరేగి ఆడింది. సంజూ శామ్‌సన్ 47 బంతుల్లో 111 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 11 ఫోర్లు, 8 సిక్సర్లతో దమ్ముదుళిపి ప్రేక్షకులను అలరించేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయి 35 బంతుల్లో 75 పరుగులు (8 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి సత్తా చాటాడు. ఆఖరిలో హార్దిక్ పాండ్యా కూడా దూకుడుగా ఆడి అర్ధ శతకాన్ని (47) తృటిలో చేజార్చుకున్నాడు. రియాన్ పరాగ్ మోస్తరు పరుగులతో (34) జట్టుకు భారీ స్కోర్ అందించాడు. బంగ్లా బౌలర్లు భారత్‌ను తమ బౌలింగ్‌తో ఏమాత్రం నియంత్రించలేకపోయారు. తంజిమ్ హసన్ సకీబ్ మూడు వికెట్లు తీయగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా ఒక్కో వికెట్ తీశారు.
భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన బంగ్లా ఆటగాళ్లు పూర్తిగా చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకు పరిమితమై మ్యాచ్‌ను చేజార్చుకుంది. పర్వేజ్ హుస్సేన్ ఎమాన్ గోల్డెన్ డకౌట్‌తో తీవ్ర ఒత్తిడిలో పడిన బంగ్లా ఆఖరు వరకు అదే భావంలో మునిగి పరాజయం బాట పట్టింది. తౌహిద్ హృదయ్ 63 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలవగా.. లిటన్ దాస్ 42 పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లు 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇక బంగ్లా ఆటగాళ్లతో భారత బౌలర్లు చెడుగుడు ఆడుకున్నారు. ఏకంగా ఏడు మంది బౌలింగ్ వేయగా.. రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీయగా.. మయాంక్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో ఒక వికెట్ తీయడం విశేషం.
A perfect finish to the T20I series 🙌#TeamIndia register a mammoth 133-run victory in the 3rd T20I and complete a 3⃣-0⃣ series win 👏👏
Scorecard - https://t.co/ldfcwtHGSC#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/BdLjE4MHoZ
— BCCI (@BCCI) October 12, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook