India vs Australia 3rd Test Day 2 Highlights: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయి 45 ఓవర్లలో 96 పరుగులు చేసింది. ప్రస్తుతానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 242 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు చేతిలో ఉన్నాయి.
శుక్రవారం ఉదయం ఓవర్ నైట్ స్కోరు 166/2తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 338 పరుగులు చేసి ఆలౌటైంది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(131; 226 బంతుల్లో 16 ఫోర్లు) శతకం సాధించాడు. టాలెంటెడ్ ఆటగాడు మార్నస్ లబుషేన్(91; 196 బంతుల్లో 11 ఫోర్లు) శతకం చేజార్చుకున్నాడు. సెంచరీ భాగస్వామ్యం తర్వాత లబుషేన్ ఔటయ్యాడు. కానీ మరో ఎండ్‌లో స్టీవ్ స్మిత్(Steve Smith) పరుగులు సాధించాడు. కామెరూన్ గ్రీన్, పాట్ కమిన్స్ డకౌటయ్యారు.
Also Read: Ravindra Jadeja ఫీల్డింగ్ మాయాజాలం.. స్టీవ్ స్మిత్ షాక్.. వీడియో వైరల్
చివర్లో టీమిండియా(Team India) ఆటగాడు జడేజా అద్భుతమైన త్రోకు స్టీవ్ స్మిత్ చివరి వికెట్‌గా వెనుదిరగడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లతో రాణించాడు. అరంగేట్ర బౌలర్ నవదీప్ సైనీ 2, జస్ప్రిత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. తొలి టెస్టులో రాణించిన సిరాజ్‌కు ఒక్క వికెట్ దక్కింది.
Rahane and Pujara survive as India finish the day on 96/2, a deficit of 242 after Australia posted 338.
Who was the star of the day?#AUSvIND SCORECARD ▶ https://t.co/Zuk24dsH1t pic.twitter.com/QPB4AFg9eg
— ICC (@ICC) January 8, 2021
అనంతరం టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ శుభారంభాన్నిచ్చారు. తొలుత ఓపెనర్ రోహిత్ శర్మ(26; 77 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అతడికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. యువ సంచలనం గిల్(50; 101 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసిన అనంతరం ఔటయ్యాడు. మరో వికెట్ పడకుండా కెప్టెన్ అజింక్య రహానే(5 నాటౌట్: 40 బంతుల్లో), చటేశ్వర్ పుజారా(9 నాటౌట్: 53 బంతుల్లో) ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.
Also Read: India vs Australia 3rd Test Day 1 Highlights: సిడ్నీ టెస్టులో తొలిరోజు ఆతిథ్య ఆస్ట్రేలియాదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
IND vs AUS 3rd Test: ఆసీస్ బౌలర్లకు రహానే, పుజారా పరీక్ష!
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం సాధించిన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్
తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ వికెట్లు కోల్పోయిన భారత్
మరో వికెట్ పడకుండా అడ్డుగొడ కట్టిన అజింక్య రహానే, చటేశ్వర్ పుజారా