అడిలైడ్ వేదికగా జరగుగున్న రెండో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఆసీస్ 298 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో కోహ్లీసేన 299 పరుగుల టార్గెట్ ను చేధించాల్సి ఉంది. కాగా షాన్ మార్ష్ సెంచరీ (131) తో కదం తొక్కడంతో ఈ మేరకు స్కోర్ సాధ్యపడింది. స్కోర్ లో దాదాపు సగం వరకు షార్ మార్స్ చేసిన పరుగులే ఉండటం విశేషం. ఆసీస్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు అలెక్స్ క్రే (18), ఆరోన్ ఫించ్ (06 ) తక్కువ స్కోర్లకు ఔట్ అయ్యారు. ఫాంలో ఉన్న ఉస్మాన్ ఖ్వాజా కూడా 21 పరుగులకే పెలివియన్ బాటపట్టాడు. ఆ తర్వాత వచ్చిన షాన్ మార్ష్ భారత బౌలర్లపై ఎదురు దాడి చేశాడు. షాన్ మార్ష్ కు పీటర్ హ్యాడ్స్కొంబ్ ( 20 ) మార్కస్ స్టోయినిస్ (29 ) గ్లెస్ మాక్స్ వెల్ (48 ) తమ వంత సహకారం అందించారు ఫలితంగా ఆసీస్ 296 పరుగులు రాబట్టింది. చివరి ఓవర్లలో షాన్ మార్స్ వెనుదిరిగిన తర్వాత మిగిలిన వికెట్లు వెనువెంటనే పడిపోవడంతో ఆసీస్ మరింత భారీ స్కోర్ చేయలేకపోయింది. బౌలింగ్ విషయానికి వస్తే పేసర్ భువనేశ్వర్ 4 వికెట్లు, షమీ రెండు వికెట్లు పడగొట్టారు. జడేజా ఒక వికెట్ల తీశాడు. కాగా ఆసీస్ ఉంచిన భారీ లక్ష్యాన్ని టీమిండియా ఈ మేరకు చేధిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది