INDIA VS AUS: మ్యాచ్ టైం కూడా తప్పేనా... పరువు తీసుకున్న హెచ్సీఏ.. ఛీ ఛీ ఇంత ఘోరమా..!

INDIA VS AUS: భారత్ ఆస్ట్రేలియా మధ్య చివరి టీ ట్వంటీ మ్యాచ్ కు వేదికైంది హైదరాబాద్. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సిరీస్ లోని చివరి మ్యాచ్ వివాదాల్లో చిక్కుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్ నిర్వాకంతో అన్ని సమస్యలే వచ్చాయి. మ్యాచ్ టికెట్ల విక్రయం దుమారం రేపింది.

Written by - Srisailam | Last Updated : Sep 25, 2022, 03:50 PM IST
INDIA VS AUS: మ్యాచ్ టైం కూడా తప్పేనా... పరువు  తీసుకున్న హెచ్సీఏ.. ఛీ ఛీ ఇంత ఘోరమా..!

INDIA VS AUS: భారత్ ఆస్ట్రేలియా మధ్య చివరి టీ ట్వంటీ మ్యాచ్ కు వేదికైంది హైదరాబాద్. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సిరీస్ లోని చివరి మ్యాచ్ వివాదాల్లో చిక్కుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్ నిర్వాకంతో అన్ని సమస్యలే వచ్చాయి. మ్యాచ్ టికెట్ల విక్రయం దుమారం రేపింది. టికెట్ల విక్రయంపై క్లారిటీ లేకపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆన్ లైన్ టికెట్ల బుకింగ్ లో సమస్యలు వచ్చాయి. జింఖాన్ గ్రౌండ్ లో చేపట్టిన ఆఫ్ లైన్ టికెట్ల విక్రయం యుద్ధ రంగాన్నే తలపించింది. వేలాది మంది తరలిరావడం.. ఒకే ఒక్క కౌంటర్ పెట్టడంతో క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి కంట్రోల్ చేయాల్సి వచ్చింది. పోలీసుల లాఠీచార్జీలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టికెట్లు ఎవరికి ఇచ్చారో ఎన్ని విక్రయించారో స్పష్టత ఇవ్వలేదు. దాదాపు 12 వేల 500 టికెట్ల లెక్క తేలలేదు. ఆ టికెట్లను ఏం చేశారో, ఎవరికి అమ్మారో మిస్టరీగా మారింది. హెచ్ సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జాతీయ స్థాయిలో హైదరాబాద్ పరువు పోయింది.

తాజాగా  హెచ్‌సీఏ మరో తప్పిదం బయటపడింది. మ్యాచ్ టైమ్ ను టికెట్లపై తప్పుగా ముద్రించింది. చివరి మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలు కానుంది. ఆరున్నర గంటలకు టాస్ వేస్తారు. కాని హెచ్ సీఏ విక్రయించిన మ్యాచ్ టికెట్లపై 7.30కు మొదలవుతుందని ఉంది. పది రోజులు ముందు నుంచే టికెట్లు అమ్ముతున్నా ఈ తప్పిదాన్ని గుర్తించలేకపోయింది హెచ్సీఏ.   మీడియాకు పంపించిన మొయిల్ లో మ్యాచ్ ఏడు గంటలకు మొదలవుతుందని తెలిపింది హెచ్సీఏ. టికెట్లపై టైమ్ చూసి అభిమానులు 7.30కి వస్తే అరగంట ఆటను మిస్ కావాల్సిందే.అయితే టికెట్లపై టైమింగ్ తప్పుగా ముద్రించిన విషయాన్ని మాత్రం హెచ్‌సీఏ అంగీకరించడం లేదు.

Also Read:   IND vs AUS: ఉప్పల్ మైదానానికి వెళ్లే అభిమానులకు కీలక సూచన ఇదే..!

Also Read: Mission 2024: నితీష్ రాకతో కాంగ్రెస్ లో జోష్.. విపక్షాలను ఏకం చేసే పనిలో సోనియా గాంధీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News