India announce 18-man squad for South Africa Tests : దక్షిణాఫ్రికాలో పర్యటించబోయే భారత టెస్ట్ టీమ్ ఫైనల్ అయ్యింది. జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి వ్యవహరించనున్నారు. వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండనున్నారు. ఇక గాయాల కారణంగా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పాటు ఆల్‌రౌండర్స్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నారు.
పుజారా, రహానేలకు జట్టులో చోటు కల్పించారు సెలెక్టర్లు. 18 మంది సభ్యుల రెగ్యులర్ జట్టులో (18-member squad) వీరిద్దరూ కూడా ఉన్నారు. ఇక ఇండియా-ఏ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పటికే సౌత్ ఆఫ్రికా పర్యటనలో (South Africa) ఉన్న నవ్‌దీప్ సైనీ, దీపక్ చాహర్, సౌరభ్ కుమార్, అర్జాన్ నగ్వాస్‌వాల్లాలను స్టాండ్ బై ప్లేయర్స్‌గా ప్రకటించారు.
జట్టు ఇదే..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), Virat Kohli (Captain), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), Rohit Sharma (vice-captain), కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఎండీ సిరాజ్.
Squad: Virat Kohli (Capt),Rohit Sharma(vc), KL Rahul, Mayank Agarwal, Cheteshwar Pujara, Ajinkya Rahane, Shreyas Iyer, Hanuma Vihari, Rishabh Pant(wk), Wriddhiman Saha(wk), R Ashwin, Jayant Yadav, Ishant Sharma, Mohd. Shami, Umesh Yadav, Jasprit Bumrah, Shardul Thakur, Md. Siraj. pic.twitter.com/6xSEwn9Rxb
— BCCI (@BCCI) December 8, 2021
Also Read : ICC Test Rankings: రెండో స్థానంకు ఆర్ అశ్విన్.. 31 స్థానాలు ఎగబాకిన మయాంక్!
ఇక మూడు టెస్ట్‌ల సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న కోహ్లీ సేనను ఉత్సాహపర్చేందుకు.. భారత క్రికెట్ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రోమో రిలీజ్ చేసింది.
#FirstKaThirst begins as #TeamIndia looks for their maiden Test series victory in 🇿🇦
Do you #BelieveinBlue to create history?#SAvIND Test Series | Starts Dec 26 I Star Sports Network & Disney+Hotstar pic.twitter.com/PC8UEgI2cS
— Star Sports (@StarSportsIndia) December 8, 2021
అయితే 1992 నుంచి సౌత్ ఆఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా ఇంత వరకు ఒక్క టెస్ట్ సిరీస్‌లో కూడా నెగ్గలేకపోయింది. ఈ సారి ఎలాగైనా సిరీస్ నెగ్గాలని టీమిండియా (Team India) భావిస్తోంది. ఇక.. ప్రస్తుత సిరీస్.. తొలి టెస్ట్ డిసెంబర్ 26న జరగనుంది. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 3న ఉంటుంది. సిరీస్‌లో ఆఖరిదైన మూడో టెస్ట్ జనవరి 11న జరగనుంది.
Also Read : Bipin Rawat death news: ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో CDS బిపిన్ రావత్ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook