వీడియో: రోహిత్ శర్మను ఆటపట్టించిన ధోని

వీడియో: రోహిత్ శర్మను ఆటపట్టించిన ధోని

Last Updated : Nov 2, 2018, 03:31 PM IST
వీడియో: రోహిత్ శర్మను ఆటపట్టించిన ధోని

వెస్ట్ ఇండీస్‌తో సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు గురువారం స్టేడియం వెలుపల, హోటల్లో బాగా జోష్‌లో కనిపించారు. సిరిస్ గెలుచుకుని హోటల్‌కి చేరుకున్న ఆటగాళ్లకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సిరీస్‌తో వన్డేల్లో వేగంగా 200 సిక్సులు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ హోటల్లో కేక్ కట్ చేస్తుండగా.. ఆ పక్కనే ఉన్న ధోని మరో ఆటగాడితో కలిసి రోహిత్ చెవి దగ్గరే బెలూన్స్ పేల్చి అతడిని భయపెట్టారు. హఠాత్తుగా బెలూన్ పేలుడు శబ్ధం వినిపించిన రోహిత్ శర్మ ఒక్కసారిగా ఉలిక్కిపడగా.. అది చూసి ధోని తెగ నవ్వుకున్నాడు. ధోని ముఖంలో నవ్వులు చూసి అందరి ముఖాల్లోనూ నవ్వులు విరబూశాయి. రోహిత్ శర్మపై ధోని ప్రయోగించిన ఈ ప్రాంక్ వీడియోను బీసీసీఐ ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది. ఆ వీడియో ఇక్కడ మీ కోసం.

 

Trending News