Rohit Sharma Smashes 2nd Fastest To 10000 ODI Runs: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్ 2023లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలతో చెలరేగాడు. శ్రీలంకతో నేడు జరుగుతున్న మ్యాచ్‌లో 48 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్, షాహిది అఫ్రిది రికార్డులను బ్రేక్ చేశాడు. వన్డేల్లో వేగంగా 10 వేలు పరుగులు చేరుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా.. రోహిత్ శర్మ 241 ఇన్నింగ్స్‌ల్లో చేరుకున్నాడు. సచిన్ (259 ఇన్నింగ్స్‌లు)ను దాటేశాడు. ఆ తరువాతి స్థానంలో సౌరవ్ గంగూలీ (263), రికీ పాంటింగ్ (266) ఉన్నారు.
పది వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. హిట్‌మ్యాన్ సిక్సర్‌తో 10 వేల పరుగులను పూర్తి చేసుకోవడం విశేషం. వరల్డ్ కప్‌కు ముందు రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడంతో టీమిండియా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. భారత్ తరుఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీళ్లే..
==> 18426 - సచిన్ టెండూల్కర్
==> 13024 - విరాట్ కోహ్లీ
==> 11363 - సౌరవ్ గంగూలీ
==> 10889 - రాహుల్ ద్రవిడ్
==> 10773 - ఎంఎస్ ధోని
==> 10001 - రోహిత్ శర్మ
అదేవిధంగా ఆసియా కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. షాహిది ఆఫ్రిది రికార్డును బద్దలు కొట్టాడు. ఆసియా కప్‌లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీళ్లే..
==> 28- రోహిత్ శర్మ
==> 26- షాహిది ఆఫ్రిది
==> 23- సనత్ జయసూర్య
==> 18- సురేష్ రైనా
Also Read: Ys jagan on Chandrababu Case: చంద్రబాబు అరెస్టు పరిణామాలపై జగన్ సమీక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook